గ్రేటర్ ఎన్నికలు ఒక పరిశీలన

6 Feb 2016

గ్రేటర్ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాదించింది. గ్రేటర్ పరిదిలో తొలిసారి యం ఐ యం ప్రమేయం లేని రాజకీయ పలితం సంబవించింది. ఈ విజయం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్సనమని అదికార పక్షం, కాదు అని ప్రతిపక్షాల విశ్లేషనలు ప్రారంబమయినాయి. ఏక పక్షంగా వచ్చిన పలితాలపై లోతైన పరిశీల అవసరం. ఈ మద్యనే వరంగల్ ఉప ఎన్నికలో తెరాస ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. అది ఎంతగా అంటే ఒక్క ప్రతిపక్షానికి కూడా డిపాజిట్ రానంతగా. దాదాపు కొంత మార్పుతో అలాంటి పలితమే గ్రేటర్ లోను నమోదైనయిది. అసలు ఇలాంటి పలితం ఎందుకు వచ్చింది. అదికార పక్షం చెభుతున్నట్లు ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్సనమని చెప్పగలమా కానేకాదు. ఎందుకంటే ఎలాంటి ప్రభుత్వానికైనా 18 నెలల కాలంలో అద్బతాలు చేయడం సాద్యం కాదు.మరి ఎందుకు ఈ విజయం లోతుగా పరిశీలిస్తే రెండు విషయాలు వెల్లడవుతున్నాయి. నాడు స్వాతంత్రం సిద్దించినపుడు దేశ ప్రజలు పండిట్ నెహ్రు నాయకత్వంలోని కాంగ్రెస్ ను ఎలా ఆదరించారో నేడు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ను సాదించిన కేసీఆర్ నాయకత్వంలోని తెరాసను అలానే ఆదరిస్తున్నారు. అది ఎంతకాలం అన్నది మునుముందు తెరాస అనుసరించే పద్దతులు, పరిస్దితుల ప్రబావం బట్టి ఆదారపడుతుంది.
ఇక రెండవ కారణం తెరాస ప్రభుత్వ పనితీరులో వచ్చిన స్పష్టమైన మార్పు. పైకి ఎలా మాట్లాడుతున్నా ఆచరణలో మాత్రం నాడు ఉద్యమంలో అనుసరించిన పద్దతులకు బిన్నంగా తన ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఉదాహరణకు ఉద్యమ చివరి దశలో చలో హైదరాబాద్ ను నిర్వహించినపుడు నాడు నగర సీపిగా ఉన్న అనురాగ్ శర్మ శాంతిబద్రతల విశయంలో కాస్త కఠినంగానే వ్యవహరించారు. ఆ సందర్బంలో కేసీఆర్ శర్మను తూలనాడారు. కాని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అదే శర్మను dgp గా నియమించారు. కీలకమైన స్దానంలో సమర్దులైన అదికారులను నియమించారు. ఈ చర్యల ద్వారా ఉద్యమ సందర్బంలో (ప్రజలను వారి ద్రుష్టిలో ప్రోత్సాహించడానికి అయినా విమర్సకుల ద్రుష్టిలో రెచ్చగొట్టడానికి అన్నా) తాము వ్యవహరించిన పద్దతులను పరిపాలన విషయంలో అనుసరించమని మంచి సాంకేతాన్ని ఇచ్చినారు.
తెలంగాణ రాష్ట్రం నేడు మిగులు బడ్జెట్ తో ఉంది అంటే దానికి కారణం హైదరాబాద్ ఆదాయం కీలకం. కొందరు విశ్లేషన చేస్తున్నట్లు సీమాంద్రులపై ప్రేమ కేవలం గ్రేటర్ ఎన్నిక వరకే అన్నది పాక్షిక సత్యం మాత్రమే. ఎందుకంటే గ్రేటర్ లో ఎలాంటి అలజడి జరిగినా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రదాన ఆదాయ వనరుకు గండి పడుతుంది. పలితంగా లోటు బడ్జెట్ వైపుగా వెలుతుంది. అంతేకాదు అనుబవమున్న ఏపి సీ యం గా చంద్రబాబు పక్క రాష్ట్రానికి ఎలాగూ ఉన్నారు పెట్టుబడులు అటుగా మరలితే పెను ముప్పు సంబవిస్తుంది. అందుకే గ్రేటర్ ఇమేజ్ ని కాపాడటం, ఎటువంటి అలజడులకు తావు ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే తన తనయుడు కేటీఆర్ ను ఐటి మంత్రిగా చేసారు. తండ్రి తనకిచ్చిన బాద్యతను సమర్దుడైన జె యస్ రంజన్ సహకారంతో విజయవంతంగా నడుపుతున్నారు కేటీఆర్.
ఇలాంటి పరిస్దితులలో సహజంగానే కొంతకాలం అదికార పార్టీకి రాజకీయంగా అనుకూల పరిణామాలు ఉంటాయి. దీన్ని గమనించని ప్రతిపక్షాలు దూకుడును ప్రదర్సిస్తున్నాయి. దాని పలితమే ఈ అవమానకర పలితాలు. ఈ విషయంలో తెదెపా వైకరి పూర్దిగా మారాలి. చంద్రబాబు గారికి గత చరిత్ర ఎంత ఉన్నా ప్రస్తుతానికి తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మరిచిపోరాదు. అక్కడి పాలన ప్రబావం వారు ఎక్కడికి వెల్లినా ఉంటుంది. బాబు ఎంత గొప్పగా పాలించినా అది ప్రజలకు అర్దం కావడానికి కొంత సమయం పడుతుంది. తొందరపడితే చులకన కావడం తప్ప సాదించేది శూన్యం. హైదరాబాద్ ఎన్నకలలో బాబు తనకున్న పలుకుబడితో కేంద్రం తో మాట్లాడి అబివృద్ది చేస్తాను అంటే, తన రాజదాని కి 4 రూపాయిలు తెచ్చుకోలేని బాబు హైదరాబాద్ ను ఏమి ఉద్దరిస్తాడు అన్న కేసీఆర్ మాటలనే అక్కడి జనం నమ్మారు ఇది బాబు తప్పుకాదు పరిస్దితుల ప్రబావం. అందుకే తెలంగాణ సమాజం సిద్దించిన తమ చిరకాల స్వప్నం ను ఆశ్వాదించే స్దితిలో ఉన్నారు. దాని పలితమే నిన్న వరంగల్ పలితం నేడు గ్రేటర్ పలితం.


by : Purushotham Reddy Makireddy