తెనాలిలో తమ్ముళ్ల గుద్దులాట

29 Feb 2016                  ఏం నువ్వేంటి చెప్పేది..? , నువ్వెంత, నువ్వు నాకు చెప్పేదేంటి పరస్పర వాగ్వాదం, ఆపై పిడిగుద్దులు. ఇదీ తెనాలిలో కౌన్సిల్ జరిగిన తీరిది. కౌన్సిల్  సమావేశాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు గొడవకి దిగడం చూస్తుంటాం. ఐతే ఇక్కడ మాత్రం సీన్ వేరు, టిడిపికే చెందిన ఇద్దరు సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకోవడంతో అంతా అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ లో ఇదే సీన్ కన్పించింది. టిడిపికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లి చొక్కాలు చించుకున్నారు. దీంతో మిగిలిన సభ్యులు షాక్ తిన్నారు అధికారపక్షానికే చెందిన ఈ ఇద్దరు వార్డు మెంబర్లు  వీధి రౌడీల్లా కలబడటంతో కౌన్సిల్ హాల్ ను రణరంగంలా మార్చేసింది. 

                కౌన్సిల్ లోని  మిగిలిన సభ్యులు రమేష్, త్రిమూర్తులను కాసేపు ప్రయత్నం తర్వాత శాంతింపజేసి పక్కకు తీసికెళ్లారు. వీరిద్దరి గొడవతో సమావేశం ఓ గంట వాయిదా పడింది. ఇంత గొడవ జరగడానికి కారణం కౌన్సిల్ ప్యానెల్ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన అనంతరం మినిట్స్ బుక్ లో నమోదు చేయాలని రమేష్ పట్టుబట్టడమే అని తెలుస్తోంది. అదేం అవసరం లేదంటూ పసుపులేటి త్రిమూర్తులు జోక్యం చేసుకోవడం రమేష్ ఆగ్రహించడం. తర్వాత మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది. తెనాలి కౌన్సిల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా టిడిపి నాయకత్వం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీలో లుకలుకలే లేనట్లు బిల్డప్ ఇచ్చే టిడిపి ఈ తగాదాతో అవాక్కయ్యారు.
We can see fighting between ruling party and opponent party. But in Tenali municipal council, fighting between TDP leaders happen.