విపక్ష వారసుల పరాజయం..

5 Feb 2016              గ్రేటర్ సిటీ ఎలక్షన్స్ లో దాదాపు విపక్షాలతో సహా వారి వారసులు కూడా చావుదెబ్బతినగా, అధికారపక్షం బరిలో దింపినవారంతా గెలుపు గుర్రాలపై స్వారీ చేసేశారు. వారి డీటైల్స్ ఇలా ఉన్నాయ్. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ వారసులు ఓటమి చవిచూశారు. ముఖేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్ లో పోటీ చేసిన విక్రమ్ గౌడ్ ఎంఐఎం అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. ఇక గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కుమార్తె శిల్పకు కూడా నిరాశే మిగిలింది.
 గెలుపు గుర్రాలు 
ముషీరాబాద్ లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి
బంజారాహిల్స్ లో కేశవరావు కుమార్తె విజయలక్ష్మి
ఖైరతాబాద్ నుంచి దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి
మోహదీపట్నం నుంచి మాజీ మేయర్ మాజిద్
అల్వాల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి
ఓడిపోయినవారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి
ఆర్ కె పురం నుంచి తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి
GHMC election 2016 results gave big shock to opponent parties. Some of the opponent leaders send their sons and daughter in to GHMC war, they also got big shock.