నేనంతే

5 Feb 2016


              సిటీ ఎన్నికల్లో టిడిపి ఓటమిపై రేవంత్ రెడ్డి అందరూ  ఊహించినట్లే స్పందించారు. వందసీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తారా అన్న నోటితోనే ఆ సవాల్ నాది కాదు కేటీఆర్ ది అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ 98సీట్లు గెలిస్తే, మళ్లీ సవాల్ ప్రకారం కేటీఆర్ రాజీనామా చేయాలంటాడు. 100 గెలిస్తే నేనేక్కడన్నా అంటాడు. అందుకే రేవంత్ అంతే అదో టైప్ అనుకోవాల్సిందే. ఐతే ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ దొంగాటకాలు కూడా అలానే ఉన్నాయ్. ముందు కేటీఆర్ వంద సీట్లనడం, తర్వాత ఎన్నికలకు ముందు కేసీఆర్ వచ్చి అబ్బే మావోడు అలా అన్లేదు, మేయర్ పీఠం మాత్రమే మాదనడం. 

                  ఇదంతా చూస్తే వీళ్లంతా ఇంతే అనుకోవాల్సిందే. ఇంతవరకూ రాజకీయాలకు దూరమవుతా అన్న వాళ్లలో ఎవడూ ఆ మాట నిలబెట్టుకోలేదు. మధ్యలో జనమే వాళ్ల నేతల ఛాలెంజ్ లపై పందేలు కాసుకుంటూ చొక్కాలు చించుకుంటారు. వీలైతే గాయాల పాలవుతారు కూడా, అందుకే  ఒరే బాబూ మారండ్రా పొలిటీషియన్లంతా ఒకటేరా బాబూ..!
All politicians are equal, they always change their talks frequently. In GHMC election campaign KTR gave open challenge to all parties, we will win 100 seats and Reventh Reddy gave counter to him.