అక్బరుద్దీన్ నోటి దూల

4 Feb 2016


                ఇష్టం వచ్చినట్లు హిందూ మతంపై విద్వేషం వెల్లగక్కే మజ్లిస్ బ్రదర్స్. ఇప్పుడు మళ్లీ నోటికి పని చెప్పారా అంటే అవుననే అనాలి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జైలు జీవితం కూడా రుచి చూసిన అక్బరుద్దీన్ ఈ మధ్య కాస్త తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఫినిష్, టాప్ లేపుతా వంటి డైలాగులేస్తున్నాట్ట. ఈసారి మనోడు కాంగ్రెస్ పై తన కన్నేసాట్ట. మోడీతో కలిసి కాంగ్రెస్ ను మటాష్ చేస్తానంటూ బీరాలు పలుకుతున్నాడట. ఏ పార్టీ అయినా నేతల తీరును బట్టి వారి పాపులారిటీని బట్టి మంచిదో చెడుదో పేరు తెచ్చుకుంటుంది.

                 కాంగ్రెస్ ఓ సముద్రం లాంటిదనే మాట వాస్తవం ముఖ్యమంత్రులుగా మంచిపేరు తెచ్చుకున్నవాళ్లున్న సమయంలో జనం ఆ పార్టీని మంచిదనుకునేవారు. పీడాకారంలా దాపురించిన నేతల హాయాంలో ఆ పార్టీలకు చెడ్డపేరు వస్తుంటుంది. అంత మాత్రాన పార్టీలు నాశనం కావాలంటే అవి ప్రాంతీయపార్టీలకే చెల్లుతుంది. ఐతే కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఎంఐఎం ఓ వీధి పార్టీ కూడా కాదు. అలాంటిది మోడీతో కలసి కాంగ్రెస్ ను స్మాష్ చేస్తాననడం అతని అవివేకానికే నిదర్శనమంటారు. గ్రేటర్ సిటీ ఎలక్షన్స్ ప్రచారంలో బాబానగర్ డివిజన్ లో మనోడిలా ప్రేలాపన చేసాడట. చూద్దాం రిజల్ట్స్ తర్వాత కనీసం ఆ వార్డులో ఐనా ఎంఐఎం గెలుస్తుందో లేదో.
MIM leader Akbaruddin Owaisi is always sensational. At the time of Kiran Kumar CM he was went to Jail also. Now he targeting on congress and comment badly.