ముందు నీ సంగతి చూస్కో

27 Feb 2016                           నీతులు చెప్పేవాళ్లు బూతులు మాట్లాడకూడదంటారు, అలానే కాంగ్రెస్ నుంచి టిడిపికి జంపైన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పుడు వైఎస్ జగన్ కు నీతులు చెప్తున్నారు. కేకలు వేయడం మాని ప్రశాంతంగా ఆలోచించాలట. ఆయన ఉద్దేశం ప్రకారం వైఎస్ జగన్ కేకలు పెట్టకూడదు. అనైతికంగా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నా, పెదవి విప్పకూడదన్నమాట. ప్రశాంతంగా ఉండటం ఇలా పార్టీలు మారిన వారికి తెలుస్తుంది కానీ ఓ పార్టీ పెట్టి అందులో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నేతకు ఎలా తెలుస్తుందని  ఫేస్ బుక్ లో మాజీ మంత్రిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. అధికార పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గ అభివృధ్దికి ఆయన  ఏం చేశాడో చెప్పాలి. ఓ వేళ ఏమీ చేయలేనప్పుడు ఎందుకు పార్టీ మారాడో కూడా చెప్పాలని అటు గురజాల, ఇటు గుంటూరు జనం అడుగుతున్నారు. 

                       జగన్ సవాల్ విసిరినప్పుడల్లా ఎన్నికలు జరిపించడం సాధ్యం కాదంటున్న డొక్కా మరి..పార్టీలు మారడం మాత్రం ఎందుకు అలా కుదురుతుందో చెప్పగలరా. ఇదే డిమాండ్ టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడే పెట్టారు. జగన్ ఎమ్మెల్యే చేత రాజీనామాలు చేయించి తిరిగి గెలిపించాలని, అప్పుడు ప్రభుత్వం అప్పగిస్తామని గొప్పలు చెప్పారు. నిజంగా ఆయనకి ఏ అధికారంతో అలా అడిగారో డొక్కాకి ఏమైనా తెలుసా అసలే పార్టీలో ఎస్సీ వర్గీకరణపై లుకలుకలు బైటపడిన తరుణంలో ముందు మీ సంగతి చూసుకుని తర్వాత ఎదుటివారికి నీతులు చెప్పాలని జనం సూచిస్తున్నారు. 
TDP leader Dokka Manikya Vara Prasad commented on YS Jagan. But first he have think about him self.