ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

25 Feb 2016                        ఢిల్లీలో ఉన్న వైఎస్ జగన్ కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో భేటీ ఆయ్యారు. ముందు చెప్పినట్లుగానే కేంద్రంలోని పెద్దలను కలిసిన జగన్, పార్టీనుంచి ఎమ్మెల్యేలు జారిపోతుండటాన్ని లైట్ తీస్కున్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగి పోయేవాళ్లని ఆపాల్సిన పని లేదన్నట్లు సంకేతాలిచ్చారు జగన్. ఐతే రాష్ట్రం అభివృధ్ది చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని మాత్రం ఆయనొక్కడే జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్నారు. 
ఇప్పటిదాకా ఏ నేత చూసినా ప్రకటనలకే పరిమితం తప్ప జగన్ లాగా కేంద్రంలోని పెద్దలకు ఏడాదికి రెండు సార్లు చొప్పున అరడజనుసార్లు ప్రత్యేక హోదాపై విన్నవించిన దాఖలాలు లేవ్ తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా, విభజన సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలని ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోసహా కేంద్రమంత్రులందరినీ కలిసారు.

                   ఐతే జగన్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని మాత్రం కలవకపోవడం వ్యూహాత్మకమే అని తెలుస్తోంది. అసలు తానీ రాష్ట్రంనుంచే ఎంపిక కాలేదని, అప్పట్లో హోదా వల్ల లాభం ఉంటుందనుకున్నామని ఇలా ఎప్పటికప్పుడు మాటలు మార్చుతున్న వెంకయ్యతో భేటీ వల్ల అనవసర సందేహాలు లేవనెత్తడమే తప్ప మరే ప్రయోజనం ఉండదు కాబట్టే జగన్ వెంకయ్యను కలవలేదని అంటున్నారు. వైఎస్ జగన్ టూర్ లో పార్టీ ఎంపిలు 
 వైసీపీ లోక్‌ సభా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
Few days back YS Jagan went to Delhi to met Central ministers for AP special status. Two days back few of YSRCP MLAs are joined in TDP, but Jagan did not care about it, still he is fighting for Special Status.