ఏపిలో కూత పెడుతుందా

22 Feb 2016                    ఏపీ ప్రతిపక్షనేత జగన్ ఢిల్లీ వచ్చారు, రైల్వే బడ్జెట్ నేపధ్యంలో ఏపీ రాష్ట్రానికి తగినన్ని నిధులు, ప్రాజెక్టులు కేటాయించాల్సిందిగా వైఎస్ జగన్ ఢిల్లీలోని కేంద్రపెద్దలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ, హోంశాఖామంత్రి  రాజ్ నాధ్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల అప్పాయింట్ మెంట్ తీసుకున్న జగన్ ఆర్ధిక బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎంపిలతో కలిసి జగన్ ఢిల్లీకి వెళ్లారు.
                           ఏపీకిహోదా అంశంపై ఇప్పటికే ప్రత్యేక భేటీలు, సభలు పెడుతున్న జగన్ బడ్జెట్ సెషన్స్ వేళ ఈ అంశంపై కేంద్రపెద్దలను మరోసారి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్రపోతూ, వాళ్లకున్న పరిమితులతో నోళ్లు నొక్కుకుంటున్నా, విపక్షనేతగా జగన్ మాత్రం చేయాల్సింది చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ విమర్శలు ఎదుర్కొంటున్నా తన పని తాను చేస్తున్నారని విశ్లేషకులు కూడా  అంగీకరించకతప్పదు. విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా కావాలంటూ ఇవ్వాలంటూ చె్ప్పిన బిజెపి, కాంగ్రెస్ ఆ దిశగా తమ ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. 
AP opponent leader YS Jagan went Delhi with his MPs. He will meet Rajnath Sing, Narendra Modi and will explain about AP special status. AP government is sleeping in AP and not talking about special status.