మోగిన యువభేరి

2 Feb 2016


               ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మోగించిన యువభేరీ ఊరూరా మోగుతోంది. కాకినాడలో మొదలుపెట్టిన ఈ ఈ కార్యక్రమం శ్రీకాకుళంలోనూ భారీయువజనసందోహనం మధ్య విజయవంతమైంది. ప్రత్యేకహోదాకోసం పోరాటానికి పిలుపు ఇచ్చిన వైఎస్ జగన్ కు విద్యార్ధులు బ్రహ్మరధం పడుతున్నారు. పార్టీలకతీతంగా ఈ అంశంపై పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని జగన్ అభిప్రాయంతో స్టూడెంట్లు కూడా ఏకీభవిస్తున్నారు. ప్రత్యేకహోదా అంటూ వస్తే ఇక చంద్రబాబు ట్యాబెట్లు పట్టుకుని అమెరికా, సింగపూర్, చైనా పోవాల్సిన అవసరం లేదన్నారు.స్పెషల్ స్టేటస్ వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశారు.ఆ వచ్చే పెట్టుబడులు చంద్రబాబు మొహం చూసే జగన్మోహన్ రెడ్డి మొహమో చూసి రావని. హోదాతో వచ్చే రాయితీలతోనే వస్తారని కుండబద్దులు కొట్టినట్లు జగన్ చేసిన ప్రసంగానికి యువతలో మంచి స్పందన వచ్చింది. 
        ఇదే సందర్భంలో విద్యార్ధులు కొందరు చేసిన ప్రసంగాలు ప్రశ్నలు కూడా అందరిలో ఆలోచన కలిగించాయ్. సౌజన్య అనే డెంటల్ కాలేజ్ విద్యార్ధిని మేక్ ఇన్ ఇండియా అంటూ అమరావతి నిర్మాణానికి సింగపూర్ సహకారం ఎందుకని మన ఏపీ ఇంజనీర్లు పనికి రారా అంటూ అడిగిన ప్రశ్నకు మంచి రెస్పాన్స్ వచ్చింది..అంతకు ముందు జగన్ భోగాపురం ఎయిర్ పోర్టు పై కోర్టు స్టే తమ పోరాట ఫలితమే అని ..అది శాశ్వతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు..యువభేరీలో జగన్ పదే పదే ప్రత్యేకహోదా ప్రత్యేక హోదా అంటూ ప్రసంగించడం విసుగు పుట్టించినా.. హోదాకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ అంశాన్నెవరూ పట్టించుకోలేదు.
YS Jagan doing a program Yuvaberi to get special status to AP. This program is getting good response in all districts. All party youth is participating in this program.