శివాజీ ఎక్కడ

8 Feb 2016


               రజనీకాంత్ గురించి కాదు మేం చెప్పేది. ఆంధ్రుల ఆశాజ్యోతి, దేశ కేమమే తన కేమం అని తలచే నటుడు శివాజీ గురించి పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కోసం ఆమరణదీక చేసిన శివాజీ, ఏపికి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించే శివాజీ కోసం జనం వెతుకుతున్నారట. మనోడు మాట్లాడే మాటలు వింటే ఎవడికైనా గుండెపోటు రావడం ఖాయం అసలు ఆమరణదీక అనే పదాన్ని ఈయనలా ఈ మధ్య కాలంలో ఎవరూ వాడలేదు, నిరాహారదీక అంటే తిండి తినకుండా దీక్ష, ఆమరణదీక్ష అంటే ఇక ఆశయం కోసం చనిపోవడమే. మొదలుపెట్టే ముందు ఆమరణదీకలన్నీ, తర్వాత రిలే నిరాహార, నిరాహారదీకలుగానే మిగిలిపోయాయ్. 

                కానీ శివాజీతో పాటు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యకుడు చలసాని శ్రీనివాస్, ఇంకో ఆయన (కారెం శివాజీ) వీళ్లు ముగ్గురూ అప్పట్లో టీవీ9లో తెగ కన్పించేవారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెగ తాపత్రయపడ్డారు..కానీ వీళ్లలో ఈ నటుడు శివాజీనే ఇప్పుడు ఏం చేస్తున్నాడో అర్దం కావడం లేదట, పోనీ ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేసింది కాబట్టే సైలెంటయ్యాడేమో అని సెటైర్లు కూడా వేస్తున్నారు.
Total AP people are searching for Sivaji. He started fasting for AP special status, he got more popular with special status moment. Now he is missing.