సబ్బం హరి..నీ అడ్రస్ ఎక్కడ

2 Feb 2016


                  లాజిక్కులకు అందకుండా ఏది మాట్లాడినా ఆ కాసేపు నిజమే కదా అన్పించడంలో సిధ్దహస్తులు కొంతమంది ఉంటారు. వైఎస్ చలవతో పాలిటిక్స్ లో కాస్త పేరుతెచ్చుకుని ఇవాళ మహా నేతలుగా బిల్డప్పులు ఇచ్చేవాళ్లలో చాలామంది ఆ  కోవకు చెందినోళ్లే. వాళ్లలో కొంతమంది ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. అనకాపల్లి మాజీ ఎంపి సబ్బంహరి సంగతే తీసుకుందాం. వైఎస్ జగన్ వెంట నడిచిన ఎంపీల్లో చివరిదాకా రాజీనామాలు చేయకుండా, ఆ మాటా ఈ మాటా చెప్పి, చివరికి ఐదేళ్లూ కొనసాగిన సబ్బం. విశాఖ ఎంపీ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీకి జైసమైక్యాంధ్ర అనే మహోన్నత పార్టీ తరపున దిగాడు. ఐతే ఎలక్షన్ ఎల్లుండు ఉందనగ తాను ఓట్లు చీలిపోవడాన్ని కోరుకోవడం లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టాడాయన. ఆ తర్వాత కొంతమంది కూడా ఇదే స్ట్రాటజీతో టిడిపికి సపోర్ట్ ఇచ్చారు. విశాఖలో ప్రశాంతత కోసం ప్రాణాలిస్తా నాకు నా సిటీ ముఖ్యం అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన సబ్బంహరి అడ్రస్ ఇప్పుడు ఎక్కడా కన్పించడంలేదు.
                    బోగాపురం ఎయిర్ పోర్డ్ రగడ కానీ విశాఖలో భూపోరాటాలు కానీ, ఎక్కడా ఏ అన్యాయాలూ లేకుండా ప్రశాంతంగా ఉందని అనుకోవాలేమో. వాళ్ల నేత కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఏదో వ్యూహాత్మక మౌనం అని. టైమొస్తే స్పందిస్తానంటూ అప్పుడప్పుడు కటింగిస్తున్నాడనుకోవచ్చు. కానీ సబ్బం హరిలాంటి రాజకీయనిరుద్యోగులు ఎక్కువకాలం రాజకీయనాటకాలకు దూరంగా ఉండలేరంటారు..మరి మనోడు అటు బిజెపిలో చేరతాడో లేక ఇప్పుడప్పుడే హడావుడి ఎందుకని. సైలెంట్ గానే ఉంటాడో చూడాలి. ఐతే పదవుల్లో ఉన్న నేతలనే పట్టించుకోని కాలంలో ఇలా తెరవెనక్కిపోతే ఇక తమ పేరు తామే చెప్పుకోవాల్సి వస్తుందేమో చూస్కోవాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Sabam Hari may be some of telugu people were froget this name. Actually he was entered in to politics through YSR. In 2014 elections he was opponent to YS Vijayamma. So now in not in address.