పార్టీనే ప్రశ్నార్థకం

2 Feb 2016                    పవన్ కల్యాణ్ పార్టీనే ప్రశ్నార్థకమని పార్టీ పెడుతున్నది ప్రజల తరపున ప్రశ్నించడానికని చెప్పడం పెద్ద బూటకమని ఓ వృధ్దుడు తేల్చి పారేశాడు. తాను చనిపోతూ రాసిన సూసైడ్ నోట్ లో ఇలా పొందుపరచడం కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం కాపుల రిజర్వేషన్ల అంశం సంచలనం కలిగిస్తుండగా. ఈ సందర్భంలో కాపువర్గాలను బిసిల్లో చేర్చాలంటూ కాకినాడలో చీకట్ల రమణమూర్తనే 53ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఈయన నివాసముంటున్నాడు. సినిమారోడ్డులోని డీజిల్ హౌస్‌లో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి, కుమారుడు రాజేష్ ఉన్నారు. కలెక్టరేట్‌లోని బెన్నెట్ క్లబ్ మేడపైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన టీవీ డిష్‌కు నైలాన్ తాడు కట్టుకుని దూకి చనిపోయాడు. ఈ సందర్భంగా అతని దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో సామాజికంగా ఆర్ధికంగా కాపులు వెనుకబడి ఉన్నారని. ఉద్దరిస్తానడుకున్న పవన్ పత్తా లేకుండాపోయాడని అందులో వాపోయాడు వెంకటరమణమూర్తి అసలా పార్టీనే పెద్ద ప్రశ్నగా మిగిలిందని రాసాఢు రమణమూర్తి.
                       అతని మృతదేహాన్ని 
మాజీ ఎంపి ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్పీసీ ఎమ్మెల్యే లు జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సందర్శించారు. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశంలో సెంటిమెంట్ కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం మాత్రం కలవరపరుస్తోంది.
Present hot topic in AP politics in Capu cast to join in BCs. For this all parties are doing politics. Today 53 years old man was committed to suicide and wrote about Pavan Party.