ప్రతీదీ స్వఛ్చ్ తోక తగిలిస్తే సరి

18 Feb 2016


                              స్వఛ్చ భారత్ ఈ నినాదం వరకూ ఓకే, కానీ ప్రతి కార్యక్రమానికి దాంతో లింక్ పెట్టడం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి అలవాటైపోయింది. చంద్రబాబుతో గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆయన మరుగుదొడ్లని భారీగా నిర్మించిన స్పీకర్ కోడెలను అభినందించారు. టిడిపి పాలన జరిగినరోజుల్లోనూ ఇన్నిటాయిలెట్లు అవసరమైనా ఎందుకు ఇన్నాళ్లూ పట్టించుకోలేదంటూ జవాబు ఉండదు కానీ, పొగడ్తల్లో మాత్రం భట్రాజులను మించిపోతారాయన. మోడీ దైవదూత అని జనం కష్టాలు తీరిపోయాయని పొగిడేసిన చరిత్ర వెంకయ్యది. స్వఛ్చ పల్లె స్వఛ్చ్ ప్రదేశన్ అంటూ ప్రాస కోసం ఆయన పడ్డ యాస నవ్వు తెప్పించకమానదు. గుంటూరు జిల్లాలలో గుంటూరు తర్వాత చిలకలూరిపేటకే ఇళ్లు మంజారు అయ్యాయని చెప్పాడాయన. అసలు జిల్లాలో ఏదోక ప్రాంతానికి ఎక్కువ ఆ తర్వాత తక్కువ ఉంటాయి. అంత మాత్రాన అదే పెద్ద ఘనత అనడం ఏంటో ఎవరికి అర్ధం కావాలో మరి. 

                             దేశంలో 20 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలు ఇచ్చామన్న వెంకయ్య అందులో కనీసం వెయ్యి మందికైనా 5వేల రూపాయల రుణం ఇచ్చారేమో చెప్పాలి. ఏప్రిల్‌ 1 నుంచి ప్రధాని పంటల బీమా పథకం ఉంటుందన్న వెంకయ్య ఒకప్పుడు సబ్సిడీలు దండగ అని చెప్పిన సంగతి మర్చిపోకూడదు. ఈ పర్యటనల్లోనే బాబు ఫార్మర్, రిఫార్మర్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇదంతా నిజమేనా పరిస్థితులు నిజంగా అంత సొంపుగా  ఉన్నాయా, ఏపీవాసులకే తెలియాలి మరి.
Recently Central minister Venkaiah Naidu and Chandrababu visited in Guntur District. In this visiting Venkaiah Naidu prise Kodela Siva Prasad for constructing wash rooms.