ఎవడి డప్పు వాడు కొట్టుకోండి

27 Feb 2016                 కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు లిద్దరూ ఒకరిడప్పు ఒకరు కొట్టుకుంటున్నారట. ఇది మేం అనడం లేదు మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు  రెండేళ్ల కాలంలో నాయుడులిద్దరూ రాష్ట్రానికి పెద్ద గుండు సున్నా మిగిల్చడం కాకుండా ఇంకా ఒకరినొకరు పొగుడుకోవడం ఏంటని బొత్స డైరక్ట్ గా అడిగేశారు. కాగా సదరు డప్పు వాయింపుడుకు ఏపీజెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం ఉందుకు వేదిక అయింది. చంద్రబాబు, కేంద్రం సమన్వయంతోనే మిగులు విద్యుత్ వచ్చిందని వెంకయ్యనాయుడు పొగడగా, ఆయనంతోడు ఇంకోడు లేడని చంద్రబాబు ఎదురు డప్పు వాయించేశారు. కార్యక్రమంలో వెంకయ్యకోతలకు అంతే లేకుండా పోయింది. 
             
          గతంలో లోన్లు ధనవంతులకే వచ్చేవట, మోడీప్రభుత్వం వచ్చిన తర్వాతే సామాన్యులకు కూడా వస్తున్నాయట. ఇంతకంటే నీచం  ఇంకోటి లేదు ఇన్నాళ్లూ బ్యాంకులు లోన్లే ఇచ్చేవి కాదా, పైగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి కానీ అమల్లోకి రాని బీమా పథకం అప్పుడే వచ్చినట్లు రైతులకు విపరీతమైన సాయం అందుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఏపికి చాలా ప్రాధాన్యం కేంద్రం ఇస్తున్నట్లు చెప్పిన వెంకయ్య హోదా సంగతి కానీ, రాయితీల సంగతి కానీ చెప్పనే లేదు. రేపు బడ్జెట్ వచ్చిన తర్వాత ఈయనగారి మాటల్లోని డొల్లతనం బైటపడకతప్పదు.
Venkaiah Naidu and Chandrababu naidu both are cheaters. In APGENCO thermal power station opening they both are priding with each other.