వర్ల..రామయ్య

27 Feb 2016                     కొంతమంది పేరుకు తగ్గట్లు బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది వారి పేర్లకు ప్రవర్తనకు అస్సలు సంబంధం ఉండదు. విషయానికి వస్తే, టిడిపిలో జగన్ బీట్ అంటూ కొంతమంది ఉంటారని గతంలో అనేకసార్లు చెప్పుకున్నాం వాళ్లందరికీ పనేం ఉండదు, వైఎస్ జగన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన మూమెంట్స్ ఏంటి ఇవి కనిపెట్టడం వాటిపై భీకరంగా విమర్శలు చేయడం ఇదే పనిగా పెట్టుకుంటారు. ఈ పనిలో సక్సెస్ అని టిడిపి అధినేత చంద్రబాబుకు అన్పించినప్పుడు వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు కార్పొరేషన్ పదవులు దొరుకుతుంటాయ్. వాటిలో కొన్ని ఆఫర్లు వెంటనే దొరకొచ్చు కొన్ని లేటవ్వచ్చు.

                     పైన చెప్పుకున్న బృహత్తరకార్యక్రమంలో భాగంగా అధికార ప్రతినిధిగా తెరపైకి వచ్చిన వర్లరామయ్య వైఎస్ జగన్ త్వరలోనే జైలుకు వెళ్తారంటూ అక్కసు వెళ్లగక్కారు. ఈడీ తీర్పు వస్తే తీహార్, లేదంటే చంచల్ గూడ అంటూ తీర్పులు కూడా ఇచ్చేశాడాయన. ఖచ్చితంగా ఓ వారం క్రితం ఓ దమ్మున్న పత్రిక కూడా జగన్ ఢిల్లీ వెళ్లి ఈడీకి సరెండరవుతాడు. అక్కడ సమాధానం సరిగా లేకపోతే అరెస్ట్ కూడా చేస్తారని వండేసింది. ఐతే అదే ఈడీ వేసిన పిటీషన్ ను సిబిఐ కోర్టు నిన్ననే తిప్పికొట్టింది. ఆస్తుల కేసులో విచారణ సిబిఐ చేస్తుందని ఈడీకి అప్పగించాలన్న పిటీషన్ ను తిరస్కరించింది. ఆ విషయం కూడా గుర్తు చేసుకోకుండా తీర్పులిచ్చేస్తున్న వర్లరామయ్యది కేవలం వృత్తి ధర్మమే తప్ప వేరే లోపం లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయదని జగన్ బీట్ అధినేతని మెప్పించడంలో ఒక్కోసారిలా జడ్జిల పాత్ర పోషించాల్సి వస్తుంది. ఒక్కోసారి సిబిఐ, మరోసారి ఈడీ అలా పరకాయప్రవేశం చేసి విమర్శలు చేయాల్సి రావడం రామయ్య ప్రారబ్దం మరి ఏంచేస్తాం.
TDP party appointed some of the leaders to watch about YS Jagan, where he is going and what he is doing. They will get cabinets.