టిడిపికి ఆఫరిస్తున్న వీహెచ్

22 Feb 2016                  నిండా వర్షంలో తడుస్తున్న ఓ కారు యజమాని, గొడుగుతో నడిచిపోతున్న మనిషికి లిఫ్టిస్తున్నట్లుంది కాంగ్రెస్ నేత హన్మంతన్న వైఖరి. ఏపీ సిఎం చంద్రబాబు ఇక తెలంగాణ టిడిపిని పట్టించుకోడని చెప్తున్నాడాయన. అందుకే ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అంతా సైకిల్ దిగి, కాంగ్రెస్ లో చేరాలని పిలుపు ఇస్తున్నాడాయన. కేసీఆర్ వలలో వరసగా టిడిపి ఎమ్మెల్యేలు పడుతూ పార్టీని ఖాళీ చేస్తే నెక్ట్స్ టార్గెట్ కాంగ్రెస్సే అని తేలిపోయింది. బస్వరాజ్ సారయ్యను పార్టీలో చేర్చుకోబోతున్న కేసీఆర్ భయంతో వీహెచ్ మిగిలిన అడుగు బొడుగూ నేతలను కాంగ్రెస్ లోకి పిలవడం భలే కామెడీగా మాట్లాడుతున్నట్లుంది. 

            లేకపోతే టిడిపి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లోకి ఎందుకు రావాలి వస్తే లాభమేంటనే ప్రశ్నలకు జవాబులివ్వకుండా. చంద్రబాబు ఏపీలో బిజీ కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ లో చేరడమేంటో ఆయనకే తెలియాలి. సోనియాగాంధీ హైదరాబాద్ రాదు కాబట్టి, టిఆర్ఎస్ లో చేరతారా ఏంటి. అంతటితో ఊరుకోకుండా వీహెచ్ పార్లమెంట్ సమావేశాలకు జాట్ రిజర్వేషన్ రగడకు ముడిపెట్టాడాయన. ఎక్కడ సభలోప్రజలు సమస్యలు లేవెనెత్తుతారో  అని జాట్ల సమస్య ఎన్డీఏ సృష్టించిందట. వీహెచ్ కు ఎర్లీగా ఎండ దెబ్బతగిలిందేమో అని ఈ మాటలు వింటే అనుమానం రావడం ఖాయం. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలే ఉంటాయని చిలకజోస్యం కూడా చెప్పారు వీహెచ్.
Telangana Congress Leader V Hanumanth Rao giving an offer to TDP. He invite T TDP MLAs in to Congress. Chandra Babu dont concentrate on Telangana TDP, so he giving this offer.