బడ్జెట్ లో పెరిగేవి..తగ్గేవి

29 Feb 2016                      కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పన్ను మినహాయింపులు, పన్నుపోటు లేకపోయినా పరోక్షంగా మాత్రం కొన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయ్, కొన్ని తగ్గుతాయని అంటున్నారు. ఐతే పన్ను పరిధిలోకి వచ్చే ఏ సేవలపై అయినా కృషీ కళ్యాణ్ ట్యాక్స్ విధించడంతో ఇంకొన్ని రకాల సేవలు మరింత ఖరీదు కానున్నాయ్. కేంద్ర బడ్జెట్ లో ఎక్సైజ్ సుంకం పొగాకు ఉత్పత్తులపై 15శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సిగరెట్ రేట్లు పెరగబోతున్నాయ్. బ్రాండెడ్ దుస్తులు, గూడ్స్, వస్తువులు ఏవైనా సరే వేయి రూపాయలపైన ఖరీదున్నవి కొనాలంటే పర్సులు చూసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. వీటితోపాటు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతీ సేవపై కృషి కల్యాణ్ సెస్ ను అరశాతం వర్తింపజేయడంతో చాలా సర్వీసులు భారం కాబోతున్నాయ్. దీంతో సర్వీస్ ట్యాక్స్ దీంతో 14.50నుంచి 15శాతం అవుతుంది. 

                         అంటే బయట రెస్టారెంట్స్ , హోటల్స్ లో ఆహారం ఖరీదు కానుంది. అలానే వచ్చే జూన్ 1 నుంచి ఫోన్ కాల్స్ , ప్రాపర్టీ కొనుగోళ్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా భారీగానే  పెరగబోతున్నాయ్. మీడియారంగంలోని ప్రచారం, విదేశాల ప్రయాణం, ఆర్కిటెక్చర్ సేవలు, కన్ స్ట్రక్షన్ సర్వీస్, క్రెడిట్ కార్డ్ సర్వీసులతో పాటు, ఈవెంట్ మేనేజ్ మెంట్లు కూడా కృషి కల్యాణ్ సెస్ తో మరింత రేటు పెరగబోతోందని తెలుస్తోంది. ఈ సెస్ టెలికాం తో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తన షాక్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాదే సర్వీస్ ట్యాక్స్ ను 12.36 శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచిన అరుణ్ జైట్లీ ఇప్పుడు స్వఛ్చ్ భారత్ సెస్ తో 14.50శాతానికి చేరగా. కృషీ కల్యాణ్ సెస్ తో 15శాతానికి చేరినట్లైంది. 

                             ఇక పెరిగే వస్తువుల విషయానికి వస్తే కెమెరాలు, కంప్యూటర్లు, ఏసీ,  టీవీలు, ప్లాస్మా టీవీలు పెరగనున్నాయి. పర్యాటక రంగం, కార్పోరేట్ వైద్యం ఖరీదు కానుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పెరగనున్నాయి. ఆల్క హాల్ రేట్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. ఆభరణాలపై పన్ను విధింపుతో బంగారం రేటు పెరగబోతోంది. అలానే లగ్జరీ కార్లు, డీజిల్ కార్లు, చివరికి సీఎన్జీ కార్లు కూడా రేటు పెరగనున్నాయ్. డయాలసిస్ పరికరాలపై పన్ను తగ్గింపుతో వాటి ధర తగ్గనుంది. అలానే వికలాంగుల పరికరాల ఉత్పత్తుల ధరలూ తగ్గనున్నాయ్. ఇది కేంద్రమంత్రికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన మేరకు చేసినట్లు అరుణ్ జైట్లీ చెప్పారు రెడీ మిక్స్ కాంట్రాక్ట్ ధర కూడా తగ్గుతుందని తెలుస్తోంది 60  చదరపు గజాల ఇళ్లు, ప్లాట్లు నిర్మాణాలపై  పన్ను మినహాయింపు ఇవ్వడంతో  ఎంతోకొంత ఊరటగానే భావిస్తున్నారు. అలానే సింగిల్స్ బీమా ప్రీమియం కూడా ప్రయోజనకరంగా ఉండనుంది. వెండి ధరలు తగ్గనున్నాయి. మొత్తం మీద జనానికి నొప్పి తెలీకుండా పెద్దషాకే బడ్జెట్ లో తగలనుంది.
Today Central minister Arun Jetli introduced Union Budget 2016. In this budget taxes on Some of the items are increased and some of the items are decreased. Finally it is burden to normal people.