నట్టి కుమార్ ఇలా చేశాడా?

4 Feb 2016


                     చిన్న నిర్మాతలకు అండ, వాళ్ల సమస్యలపై పోరాటం అంటూ తెగ హడావుడి చేసే బ్యాచ్ లో ఫస్ట్ విన్పించే పేరు నట్టి కుమార్. ఎక్కడ ఏ ఛానల్లో చర్చ జరిగినా మనోడే ప్రత్యక్షం ఐపోయి. ఆ నాలుగు కుటుంబాల చేతుల్లోనే సినిమా థియేటర్లు చిక్కుకున్నాయని తెగ డైలాగులేస్తుంటాడు అతను. ఇప్పుడా నట్టి కుమార్ చేసిన మోసం బైటపడింది. నిర్మాత రామసత్యనారాయణకు ఓ చెక్కిస్తే అది కాస్తే బౌన్సైందిట. పైగా ఈ కేసుకు  సంబంధించి కోర్టుకు హాజరు కాకపోవడంతో, నాన్ బెయిలబల్ వారెంట్ జారీ అయింది. 
                    రామసత్యనారాయణ కూడా పెద్ద నిర్మాతేం కాదు. వరసగా డబ్బింగ్ సినిమాలు చేస్తూ, లైమ్ లైట్ లోకి వచ్చాడు. ప్రియాంక చోప్రా సెక్సీయెస్ట్  ఉమెన్ గా ఎన్నికైందని, మీ అభిప్రాయం ఏంటని అడిగితే మన అమ్మాయి, ఆ రేంజ్ కి ఎదగడం చాలా సంతోషంగా ఉందని బైట్ ఇవ్వగల ఘనుడీయన. ఐతే కాలం కలసి వచ్చింది కాబట్టి. ఇప్పుడు తానూ ఓ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి చిన్న నిర్మాతకు నట్టి కుమార్ డబ్బులకు బదులు చెక్కులివ్వడం. అది బౌన్స్ అవడం చూస్తుంటే అసలు సినిమాజీవులంతా ఇంతేనా అన్పించకమానదు.
Tollywood Producer Kumar is well familiar person to all. He fought for small producers. Preset his cheating was explored. Now he was arrested in non bailable warrant.