సర్కారీ కరివేపాకు..పసుపు

8 Feb 2016


                       తెలంగాణలో  ఇకపై ప్రభుత్వమే కరివేపాకు,కొత్తిమీర,పసుపు కారం అందించబోతోంది. ఇందుకోసం గ్రేటర్ ఎన్నికల తర్వాత సిఎం కేసీఆర్ చేపట్టిన తొలి సమీకలో ఇలా ఆదేశాలు ఇచ్చారు. సిటీలో ఏం తినాలన్నా భయం వేస్తుందని. ఇంతగా కల్తీ కావడానికి కారణం మనమేనంటూ అఁదరిపై విరుచుకుపడ్డారట దొరగారు.  ఉద్యానవనశాఖకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ఇకపై పసుపు, కారం కూడా రేషన్ సరుకుల్లా ప్రభుత్వమే సరఫరా చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారట. దానికి తోడు కొత్తిమీర కట్ట, కరివేపాకు, ఆకు కూరలు పండించడానికి ఓ ప్రణాళిక రచించాలని సూచనలు చేసారట కేసీఆర్.

                 దీంతో ఇక తెలంగాణలో జనానికి కల్తీ లేని సర్కారీ ఆకుకూరలు రాబోతున్నాయట. ఐతే మామూలుగా రైతు బజార్, సర్కారీ సరుకులంటే బెంబేలెత్తే జనం వీటిని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఎందుకంటే రైతుబజార్లు కూడా నడిపేది ప్రభుత్వమే, వాటిలో లేని నాణ్యత ఉద్యానవనశాఖ చేతిలో అధికారం పెట్టేయగానే ఎక్కడ్నుంచి వస్తుంది. కల్తీ లేకుండా ఆకుకూరలు పెరగడానికి మూసీ నది ప్రకాళన ఇంకా పూర్తి కాలేదుగా, అప్పటిదాకా మరి ఏ నీటిలో పెరుగుతాయో ఎవరికి ఎరుక.
After GHMC elections Telangana government taken a big decision, Government will supply turmeric, chilly powder, curry leaf through civil supply to good food to the people.