ప్రలోభాలు నిజమే

27 Feb 2016                            రెండ్రోజుల క్రితం వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు టిడిపి వాళ్లు రకరకాల ఆఫర్లిస్తున్నారని చెప్పారు. 20కోట్ల నుంచి 40కోట్లు పెట్టి కొంటున్నారంటూ ఆరోపించారు. ఐతే అది ఆయన మాటగానే ఉఁది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బైటికి వచ్చి ఇవే ఆరోపణలు చేస్తున్నారు. మైండ్ గేమ్ ప్రకారం టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని, తాము పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా ఏ ఆధారం లేకుండానే తమ పేర్లు తెరపైకి తెస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇవాళ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ముస్తఫాలు మాట్లాడుతూ టిడిపికి రావాల్సిందిగా రకరకాల ఆఫర్లిస్తున్నట్లు చెప్పారు. బెదిరింపులు, బుజ్జగింపులు అన్నీ జరుగుతున్నాయని అయినా మేం అలాంటి చీప్ పాలిటిక్స్ కి లొంగమని చెప్పారు.                    పార్టీ మారుతున్నట్లుగా కొంతమందిపై  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రఘుపతి చెప్పారు. ఎమ్మెల్యేలుగా గెలిపించింది ప్రజల సేవ కోసమే తప్ప పార్టీలు మార్చడం కోసం కాదని చెప్పారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచింది ప్రతిపక్షంలో ఉండటానికి అని, ఇకనైనా దుష్ప్రచారం ఆపాలని సూచించారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.
TDP is doing bad politics to attract MLAs into TDP. Today YSR mla Kona Raghupati gave an interview about now TDP is trying to attract them.