రౌడీ ఎమ్మెల్యే

10 Feb 2016                            గట్టిగా ఇలాగంటే కోర్టులో కేసేస్తారేమో తెలీదు కానీ చింతమనేని తీరు ఇలానే ఉంది. గతంలో వనజాక్షి అనే ఎమ్మార్వో పై దాడి కేసులో దాదాపు బొక్కలో పడిపోయేంత పనైంది మనోడికి, చంద్రబాబు అండతో తప్పించుకున్న చింతమనేని తీరు ఇప్పట్లో మారేలా లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న మధు అనే వ్యక్తిపై ఎమ్మెల్యే చింతమనేని అటాక్ చేశాట్ట. దీనికి బ్యాక్ గ్రౌండ్ కథనం ఏంటంటే సివిల్ ఇష్యూలో పోలీసులను కాదని, తానే తీర్పు చెప్తూ ఆ మధు అనే కానిస్టేబుల్ పై చేయి విసిరాడట.
గతంలో కూడా ఇలానే ఓ ఎస్సై స్థాయి అధికారిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ తీరుపై మీడియాలో అనేకసార్లు స్టోరీలు ప్రసారమయ్యాయ్. 

                            రౌడీరాజ్యం ఇకపై చెల్లదు నేనొచ్చా అంటూ సినిమా డైలాగులు చెప్పే చంద్రబాబుకు కూడా ఈయన అంటే డాష్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. లేకపోతే ఓ ఎమ్మార్వోని జుట్టు పట్టుకుని దాడి చేసి, దర్జాగా బైట తిరగగల సత్తా ఎవరికి ఉంటుంది. ఇదే పని ఏ కాంగ్రెస్ మనిషో, వైసీపీ ప్రజాప్రతినిధో చేస్తే, టిడిపినేతలు, మంత్రులు పేపర్లు చేసే హంగామాకి అంతుంటుందా. ఐతే ఇక్కడ వాళ్లూ వీళ్లూ కాదు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలనేది మా కథనం అది పాఠకులు గమనించాలి.
TDP MLS Chintamaneni Prabhakarao is always hot topic in news. Recently he missed for lady MLA Vanajakshi Case, Now he slapped a constable.