టిడిపి-బిజెపి బంధం బెడిసికొట్టినట్లేనా

4 Feb 2016


                  ఏపీలో కానీ, తెలంగాణలోకానీ వచ్చే ఎన్నికల్లో ఇక టిడిపి బిజెపి కలిసి పోటీ చేసే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇది పక్కాగా ప్రూవవుతోంది కూడా కాపుల రిజర్వేషన్ల అంశంలో తుని ఘటన ఈ చిచ్చు మరింత రగుల్చుతోంది. కాంగ్రెస్ నుంచి బిజెపికి జంప్ కొట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి దక్కిందంటే అది వైఎస్ చలవ వల్లనే. కాపు సామాజికవర్గాన్ని ఓ తాటిపై తెచ్చేంత సీన్ లేకపోయినా, ఏమీ లేనిచోట నిలిచిన చెట్టులా కన్నాకు మినిస్టర్ గిరీ దక్కుతూ వచ్చింది. చంద్రబాబు తనపై హత్యాయత్నం చేయించారని ప్రతీ టీవీఛానల్లో చర్చల్లో చెప్పుకునే కన్నా. బిజెపిలో ఉంటూ టిడిపికి సున్నం రాస్తున్నారని తెలుస్తోంది. అందుకే తుని ఘటనను ఆధారంగా చేసుకుని బాబుపై ఇవాళ రెచ్చిపోయారు. 
                 కాపులు మంచివాళ్లని చెప్తూ, కేసులెందుకు పెడుతున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు..హామీ మరిచిన చంద్రబాబు అది గుర్తు చేసేందుకే తాము ఆందోళన చేసామని చెప్పాడు కన్నా, ఐతే జైలుకైనా వెళ్తాం కానీ, భయపడేది లేదని చెప్పిన కన్నా. ఈ భారీ డైలాగ్స్ తో కాపుకుల నేతగా కాస్త పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి. ఎందుకంటే సమైక్యాంధ్రకి మద్దతుగా రాజీనామా చేయకుండా చివరిదాకా మంత్రి పదవి పట్టుకుని వేలాడిన కన్నా. ఆ పేరు పోగొట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు మరి.
In both telugu states Tenlangana and Andhrapradesh TDP and BJP are participating in election as joint. But GHMC election in the matter of seats both parties were fight. In the case of capu reservations also both parties leaders are opposition with each other.