ఆపరేషన్ చిరు

8 Feb 2016


                     మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగిందని ఓ ఆంగ్లపత్రిక రాసుకొచ్చింది. ఆ గాయం ఇప్పటిదిక కాదని ఎన్ని రోజులనుంచో ఆయన్ని తెగ బాధపెడుతుందని ఆ కథనం ప్రకారం తెలుస్తోంది. ఈ కారణంతోనే సిటీలోని ఓ హాస్పటల్లో ఆదివారం చిరంజీవికి సర్జరీ అప్పాయింట్ మెంట్ ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ లో ఈ న్యూస్ కలకలం రేపుతోంది. కత్తి రీమేక్ ఉండటం వల్లనే చిరంజీవీ ఈ సర్జరీకి ఒప్పుకున్నారని, మునుపటిలా జోష్ తో కన్పించాలంటే అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు అర్ధం అవుతోంది. అందులో భాగంగానే భుజానికి శస్త్రచికిత్స చేయించుకుంటున్నాట్ట. ఇది పూర్తైన తర్వాత కత్తి రీమెక్ షూటింగ్ బిగిన్ కావచ్చంటున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులనుంచి  ఎదురుచూస్తున్నారు, నూట యాభైవ సినిమా కావడంతో బాస్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. డైరక్టర్ వినాయక్ మాత్రం అఖిల్ డిజాస్టర్ మిగిల్చిన నిరాశనుంచి కోలుకునే పనిలో పడ్డాట్ట.
An english news paper published that, a surgery was done to  Megastar Chiranjeevi. Now he is geting ready for 150th film. For that movie he attended surgery.