వదలని బూతు

25 Feb 2016

                                  సన్నీ లియోన్ బూతును వదలడం లేదో, బూతే ఆమెను వదలడం లేదో కానీ. యాంటీ స్మోకింగ్ కి మద్దతుగా తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. నో స్మోకింగ్, లెవన్ మినిట్స్ అనే ఈ వీడియోలో సన్నీ లియోన్ ను చూస్తూ పొగతాగడం మర్చిపోవడమనేది కాన్సెప్ట్. అందులో సిగరెట్ తాగడం మానలేని అలోక్ నాధ్ గదిలోకి సన్నీ లియోన్ వస్తుంది. మెల్లగా గదిలోకి సన్నీ రాగానే మనోడి మతి పోతుంది. సింబాలిక్ గా గదిలో ఉన్న బల్బ్ టెంపరేచర్ హీటెక్కుతుండగా, సన్నీ వంటిపై దుస్తులు తీసేస్తోంది. ఐతే ఇంతలోనే అనుకోని విధంగా బల్బు మాడిపోతుంది, హీరో చనిపోతాడు. అసలు చెప్పొచ్చిందేంటంటే తాను అవసరమైన సమయంలో చేయాల్సినది చేయలేకపోవడానికి కారణం సిగరెట్ తాగడమంటూ సన్నీ చెప్తుంది. ప్రతి సిగరెట్ 11 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుందని ఈ కథాంశం. 

                             షార్ట్ ఫిల్మ్ లో కథాంశం ఎవరికీ కొత్త కాదు కానీ, అందుకోసం సన్నీ లియోన్ ను వాడుకోవడమే కొత్తగా ఉంది. చెప్పేది మంచి విషయమే అయినా, కాసింత రొమాంటిక్ టింజ్ జోడిస్తే బావుండని ప్రొడ్యూసర్ల ఫీలింగ్. కానీ జనం మాత్రం సన్నీ అందాల కోసమే యూట్యూబ్లో ఈ వీడియోను చూసేస్తున్నారు.
Present Sunny Leone add is creating sensation in Youtube. She did a add for non smokeing, in this video also she is very hot.