సంజయ్ కి స్వేఛ్చ

25 Feb 2016                          సంజయ్ దత్ రిలీజయ్యాడు జైలు నుంచి బైటికి వచ్చి నేలకు దండం పెట్టాడు. జైలుకి శాల్యూట్ ఛేసాడు, ఇక చచ్చినా జైలుకి రానంటూ చెప్పాడు. ఐతే ఈ ఖల్ నాయక్ చేసింది చిన్న నేరమేం కాదు. ముంబై బ్లాస్ట్ టైమ్ లో ఏకే 56 రైఫిల్ దగ్గర పెట్టుకున్న కేసులో అరెస్టయ్యాడు. దాదాపు ఐదేళ్లు జైలుశిక్ష పడింది. ఐతే అందులో 118 రోజులు పెరోల్ పై బయటే తిరిగాడనుకోండి. ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో మున్నాభాయ్ రిటర్న్స్ అంటూ బాలీవుడ్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటైంది. సంజయ్  దత్ పై కేసు అనేక విచారణల అనంతరం 2007 లో సంజయ్ దత్ కు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది మహారాష్ట్ర కోర్టు, అప్పట్లో అంటే 1993లో మంచి స్వింగ్ మీద ఉన్న సంజయ్ దత్ హీరోగా నిర్మితమవుతున్న అనేక సినిమాలు ఆగిపోయాయ్. నిర్మాతలూ నష్టపోయారు విచారణ సాగుతూ  ఉండగానే కొన్ని సినిమాలు పూర్తి చేయడానికి బెయిల్ పై బైటికి వచ్చేవాడు సంజయ్ దత్. పద్నాలుగేళ్ల తర్వాత వెలువడిన తీర్పుతో సంజయ్ దత్ దోషిగా తేలింది. ఐతే పేలుళ్లతో కానీ, ఉగ్రవాదులతో కానీ సంబంధం లేదని, వ్యక్తిగత భద్రత కోసమే తాను రైఫిల్ కొన్నట్లుగా సంజయ్ దత్ చెప్పుకునేవాడు. 

                   56ఏళ్ల సంజయ్ దత్ పై సినిమా పరిశ్రమలో సానుభూతి వ్యక్తమవుతుండేది. శిక్షాకాలంలో అనేకసార్లు పెరోల్ పై వచ్చి మున్నాబాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్ వంటి సినిమాల్లో నటించాడతను. ఐనా ఎప్పుడు జైల్లోకి వెళ్లాలో, బైటికి రావాలో తెలీని పరిస్థితి నెలకొనేది. 2013లో సంజయ్ క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఓ సందర్భంలో కన్నీళ్ల పర్యంతమయ్యాడు కూడా. సంజయ్ దత్ తరపున మాజీ సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ ఖట్జూ ఈ పిటీషన్ దాఖలు చేసారు ఐతే సుప్రీంకోర్టు ఓసారి దోషిగా తేల్చిన వ్యక్తికి ఎలా క్షమాభిక్ష ఇస్తారంటూ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావ్ తిరస్కరించినట్లు చెప్తారు. ఐతే ఈ మధ్యలో అంటే 2013 నుంచి 2014లోపు పెరోల్ పై మొత్తం 118 రోజులు సంజయ్ దత్ బయట గడిపాడు. అంతేకాకుండా ఎరవాడ జైల్లో సిబ్బంది సంజయ్ దత్ కు విఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయ్. ఏదైతేనేం ఇప్పుడు బైటికొచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే ఈలోపే ఓ హైకోర్టులో సంజయ్ దత్ విడుదలపై ఓ పిటీషన్ దాఖలైంది సో మనోడు జాగ్రత్తగానే ఉండాలి.
Bollywood hero Sunjay Dutt was released. He was prisoned for 5 years, for having a gun at the time of Mumbai incident. But he was spent 118 days on pay role.