టెన్షన్ పార్టీ

4 Feb 2016                  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కు నేషనల్ హెరాల్డ్ టెన్షన్ ప్రారంభమైనంట్లుంది. కింది కోర్టులు వారికి సమన్లు ఇవ్వడం సబబేనంటూ తీర్పులివ్వడంతో ఇక చివరి ఆశగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కింది కోర్టు సమన్లను హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
ఐతే సుప్రీంకోర్టులో చుక్కెదురైతే అది ఎన్డీఏకు మరో అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అందుకే వచ్చే ఫిబ్రవరి 20 కాంగ్రెస్ కు కీలకం కాబోతోంది. 

                నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. ఆ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌పై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టారు. అసోసియేటెడ్ జర్నల్ నుంచి 99 లక్షలరూపాయల అప్పుకే 5వేల కోట్ల రూపాయల ఆస్తులున్న కంపెనీని ఎలా బదలాయిస్తారంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటీషన్ లో పొందుపరిచారు. సెషన్స్ కోర్టు కూడా ఈ అంశంలో సోనియా,రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు కూడా అదే తీర్పును సమర్ధించడంతో కాంగ్రెస్ కు చిక్కులు మొదలయ్యాయ్. ఓదశలో బెయిల్ కూడా తీసుకోకూడదని సోనియా,రాహుల్ భావించినా వెనక్కి తగ్గి బెయిల్ పొందారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తమకు సమన్లు జారీచేయడం,వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడటంతో ఆ రోజు కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి ప్రారంభమైంది
Congress National Leader Sonia Gandhi and Rahul Gandhi are in problems. National Herald paper was closed in 2008. BJP leader Subramanya Swami filed a case, they used 2000 crores.