శోభానాగిరెడ్డి ఆత్మక్షోభ

23 Feb 2016                        ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ పార్టీ మారడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు శోభానాగిరెడ్డి మరణంతో తెరపైకి వచ్చిన అఖిలప్రియ టిడిపిలోకి ఎలా చేరతారని ప్రశ్నించారామె. తన తల్లికి సంతాపతీర్మానం కూడా పెట్టని టిడిపిలో చేరడంపై శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని వాపోయారు రోజా. ఏపీ శాసనసభకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూపంలో పెద్ద శని దాపురించిందన్నారామె. టిడిపి మునిగిపోయే నావతో పోల్చిన రోజా ఏ లాభం లేకుండా ఎలాంటి ఆశలూ చూపించకుండా ఎందుకు పార్టీ మారతారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వాళ్లంతా తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. టిడిపికి దమ్ముంటే ఆ పని చేయాలని డిమాండ్ చేశారు రోజా.


వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందని, నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన నష్టం లేదని రొటీన్ డైలాగ్ వేసిన రోజా టిడిపిని మునిగిపోయే పడవతో పోల్చారు. 

                     ఐతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గుర్తుకు చేసుకోవాల్సింది నిజంగా జంప్ జిలానీలంతా పార్టీలకు రాజీనామా చేసినా, ఉపఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలు లేదంటే బాధిత పక్ష పార్టీలు గెలిచిన చరిత్ర పెద్దగా లేదు. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ  స్థానాలకు  ఎన్నికలు రావడం వేరు, నాలుగైదు స్థానాల్లో ఎన్నికలు వేరు. అందుకే పోయినోళ్లంతా చెడ్డోళ్లు ఉన్నోళ్లు మేలు అనుకోవడానికి లేదు. పార్టీలు మారినా తమ నడవడితో ప్రజల మనసు గెలుచుకుంటే వారికే పట్టం గడతారు. ఐతే ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాళ్లే కానీ నిజంగా పార్టీల పట్ల నిబద్దత ఎక్కడ ఏడ్చింది..?
    
                    అప్పట్లో వైఎస్ జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలంతా పార్టీ పదవులతో పాటు, ఎమ్మెల్యే పదవలుకూ రాజీనామా చేశారు. ఐతే ఎక్కడ తమ ప్రభుత్వం పడిపోతోందో అన్న భయంతో విడతలవారీగా అమోదించుకుంటూ స్పీకర్ తో రాజకీయం నడిపింది అప్పటి కాంగ్రెస్. అందుకే జగన్ ఆకర్ష్ నడిపినప్పుడు మీ నీతైమైందంటూ అడిగే అర్హత అటు టిడిపికి ఇటు వేరే పక్షానికి ఎవరికీ లేదు. అప్పట్లా వీరంతా నిజంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి పార్టీలు మారితే గౌరవం ఉంటుంది కానీ  ఇప్పుడీ నేతలకు అదెక్కడ ఎలా ఉంటుందో తెలిసేడిస్తే కదా..
Four of YSRCP MLAs joined in TDP in the presence of Chandrababu. YSR MLAs Roja fired on Bhuma Nagireddy. Sobha Nagireddy, if she alive she will be very sad.