మరో దగా

8 Feb 2016


                      టిడిపి ప్రభుత్వం ఏపీలో కుండబద్దలు కొట్టేసింది. ఓడ మల్లన్న, బోడి మల్లన్న సామెతలా అవసరానికి ఆర్టీసీని వాడేసుకుని, ఇప్పుడేమో అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు పొమ్మన్నారు మంత్రి శిధ్దా రాఘవ్ రావ్ సమైక్యాంద్ర ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలపై ఓ కమిటీ వేశారు. వాళ్లు చేసిన సమ్మెని మాన్పించేందుకు ఇదో కంటితుడుపు చర్య అని అప్పుడే చెప్పారు.ఐతే అప్పటి విపక టిడిపి మాత్రం తాము  అధికారంలోకి వస్తే అవసరమైతే ఆర్టీసీ నష్టాల్లోంచి కూరుకోలేకపోతే ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.

                       ఐతే ఇప్పుడు ప్లేట్ తిరగేసేంది పైగా శిధ్దా గారు చెప్పడం ప్రకారం ఎండీతో కలిసి ఆర్టీసీ ని ఓ పద్దతి ప్రకారం డెవలప్ చేస్తున్నాం అని చెప్పడం. ఎండీతో ఇవాళ కలిసి పని చేయడం ఏంటి ఆర్టీసీ ఎండీలతో ప్రభుత్వాలు ఆ సంస్థ పుట్టిన నాటి నుంచి పని చేస్తూనే ఉన్నాయ్. ఆక్యుపెన్సీ రేషియో పెంచాలని అందరికీ తెలుసు..అదెలానో కూడా  చెప్పాలి కదా అంటే ఆర్టీసీ అలా నష్టాల బాటలో కూరుకుపోతూనే ఉంటుంది. ఎప్పుడో బుద్ది పుట్టినప్పుడు ప్రభుత్వం ఓ యాభై కోట్లు వంద కోట్లు విదిలిస్తుంది తప్ప. దాని మనుగడకు శాశ్వత ప్రాతిపదికన ఓ నిర్ణయం మాత్రం తీసుకోదని మంత్రి శిధ్దా ప్రకటనతో తేలిపోయింది.
At the time of Godhavari Pushkaralu AP government used RTC. Now RTC in losses, AP transport minister Sidha Raghavarao is saying it is not possible to merge in Government.