సరైనోడు ఊరమాస్ అట

18 Feb 2016                          బోయపాటి డైరక్షన్ లో అల్లు అర్జున్ నటించిన సరైనోడు టీజర్ రిలీజైంది. ఇందులో మనోడు బుడ్డ ఎన్టీఆర్ లా పంచ్ డైలాగ్స్ వేసాడు. ఎర్రతోలు కదా, మాస్ ఊరమాస్ అంటూ రామయ్యా వస్తావయ్యా టైపులో రెచ్చిపోయాడు. ఇప్పటిదాకా నందమూరి ఫ్యామిలీతోనే సినిమాలు చేసిన బోయపాటి ఈ సినిమాలో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టినట్లైంది.

                       గతంలో సినిమా ట్రైలర్లు ఏదైనా హాళ్లలో ఇంటర్వెల్ కు ముందు ప్లే చేసేవాళ్లు. ఇప్పుడు సరైనోడు టీజర్ కూడా ఆంద్రప్రదేశ్, బెంగళూరు తో కలిపి మొత్తం 1000థియేటర్లలో టీజర్ ను ప్రదర్శిస్తారట. దీంతో సినిమా గోయర్లకు బాగా పట్టేస్తుందని టీమ్ భావిస్తోందట. ఇందులో రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది విలన్ గా కన్పించబోతున్నాడు. ఓ రకంగా ఇది మల్టీస్టారర్ గా కూడా అనుకోవచ్చు. ఆది మలుపు సినిమా ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తోంది.
Stylish Star Allu Arjune is now doing movie Sarainodu in the direction of Boyapati Srinu. Basically Allu Arjune is family hero, now he is entering as mass hero. Today this movie trailer was released in more than 1000 theater.