రేవంత్ కామెడీ

22 Feb 2016                                జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బకి రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాకైందంటున్నారు. కేసీఆర్ దత్త గ్రామం చిన్నముల్కనూర్ లో టూర్ చేస్తున్న మనోడు అసెంబ్లీని స్తంభింపజేస్తామంటూ హుంకరిస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా టిడిపికి 80 సీట్లొస్తాయన్న రేవంత్ రెడ్డి తీరు ఇంకా మార్చుకోలేదు. ఇళ్ల పునరావాసం పనులు చిన్న ముల్కనూరులో ఆలస్యమవుతున్నాయన్న రేవంత్ రెడ్డి దానికి డెడ్ లైన్లు పెట్టడం హాస్యాస్పదం. వెంటనే అసెంబ్లీ సెషన్స్ కి ముందే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే, శాసనసభని స్తంభింపజేస్తామని వార్నింగిచ్చారు.

                       అసలు తెలంగాణ అసెంబ్లీలో టిడిపి బలమెంత, ఎమ్మెల్యేలు ఎంతమంది, తిప్పి కొడితే ఐదారుగురు ఎమ్మెల్యేలకు మించి లేని టి.టిడిపి ఎమ్మెల్యేల్లో సభకి వచ్చేదెంతమంది, వారిలో రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచేదెవరు. అసలు సెషన్స్ ప్రారంభమయ్యేలోపల పార్టీ నుంచి ఇంకో ఎమ్మెల్యే జంప్ కాడని గ్యారంటీ ఉందా అవన్నీ పక్కనబెట్టి ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలకడం ఆ తర్వాత చతికిలబడటం రేవంత్ రెడ్డి, టి.టిడిపికి తెలంగాణలో మామూలైపోయిందని జనం కూడా లైట్ తీస్కుంటున్నారు.

After GHMC elections Reventh Reddy Got shock. Present visiting China Malkapur, in this village he is giving dead line to houses.