రేవంత్ రెడ్డి ఓవరాక్షన్

9 Feb 2016


                  ఐపోయింది ఇక రాజ్యం లేని రాజులుగా రేవంత్ రెడ్డి లోకేశ్ ఎర్రబెల్లి, చంద్రబాబు సిటీలో ఊరేగడమే ఇక మిగిలింది మిగిలిపోయిన టిడిపి కేడర్ వాపోతోంది. టిడిపికి ఉన్న సిటీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగూ టిఆర్ఎస్ లోకి జంపవుతున్నారు. ఎమ్మెల్యే కాని రమణ పార్టీ అధ్యక్షుడిగా టిఆర్ఎసకు సవాళ్లు, శాపనార్ధాలు పెడుతున్నారు. ఎర్రబెల్లి సైలెంట్ గా తన పనేదో తాను చూసుకుంటున్నాడు. పార్టీలో చేరకపోతే అంతు చూస్తామని బెదరించి మరీ పార్టీలోకి లాక్కుంటున్నారని ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నారు కానీ. నిజానికి ఇంకో మూడేళ్లపాటు టిడిపితో తెలంగాణలో కానీ సిటీలో కానీ ఒరిగేందని జనమే అంటున్నారు. ఇది గమనించకుండా గ్రేటర్ సిటీ పరాభవం మరిచిపోయి మళ్లీ పాత రికార్డే ప్లే చేస్తే ఏంటి ప్రయోజనం.

           కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద టిఆర్ఎస్ లోకి జంప్ కొట్టగా, లింగంపల్లి ఎమ్మెల్యే కూడా అదే బాటలో పోతాడంటున్నారు. ఆయన మాత్రం లేదు లేదు నా పై దుష్ప్రచారం సాగుతుందని అంటున్నాడు. ఐతే ఇది కూడా ఎప్పటికైనా ఎగిరే చిలకే అని జనం గుసగుసలాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్లు రోజూ మైకు దొరికితే అదే ఎజెండాగా రెచ్చిపోతున్నారు. పొరపాటున ఆ ఎమ్మెల్యేలంతా నిజంగానే రాజీనామా చేస్తే, ఎన్నికలను తట్టుకునే శక్తి టిడిపికి ఉందా అని సగటు జీవి ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారు. అందుకే చంద్రబాబు కూడా ఈ అంశాన్ని లైట్ తీస్కుంటున్నట్లు కన్పిస్తున్నారు. అందుకే ఎక్కడా ఈ జంప్ జిలానీలపై కామెంట్ చేయడం లేదు. అటు ట్విట్టర్ పిట్ట కూడా తన పాలు,కూరగాయల యాపారం పైనే కాన్సన్ ట్రేషన్ పెట్టినట్లుందని గాసిప్స్ వస్తున్నాయ్.
Recent GHMC election results gave big shock to all opponent leaders. To this results Revanth Reddy is doing over action to protect their candidates.