తలాక్ చెప్పినట్లేనా..?

27 Feb 2016                   బిజెపి ఇక టిడిపితో దోస్తీకి తలాక్ చెప్పినట్లే అని బలంగా విన్పిస్తోంది. అందుకే అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో నేతల డైలాగుల్లో పదును పెరుగుతోంది. ఢీ అంటే ఢీ అనేట్లు మాటలు విసురుతున్నారు. ఏపీలో కృష్ణంరాజు అల్రెడీ ఆ పని మొదలు పెట్టేస్తే, కన్నా లక్ష్మీనారాయణ  రూపంలో చంద్రబాబును నక్షత్రకుడిలా వదలకుండా చీకాకు పెడుతున్నాడు. ఇక తెలంగాణలో కూడా ఆ పని మొదలైందనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా జంపై, ఖాళీ టెంట్ మిగిలినట్లున్న టిడిపికి ఓటేస్తే మోరీ లో వేసినట్లే అని బిజెపి నేతలు అంటున్నారు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డే ఆ మాట అనడం విశేషం. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తోంది. తన అభ్యర్దులకు మాత్రమే ఓట్లేయమని టిడిపి-కాంగ్రెస్ లో ఎవరికి ఓటేసినా అది మోరీ ( పెంటకుప్ప/చెత్త కుప్ప) లో వేసినట్లే అని ఆయన అనడం ఇప్పుడు స్థానికంగా వస్తున్న మార్పులకు సిగ్నల్ లా కన్పిస్తోంది.                     కిషన్ రెడ్డి లాజిక్ ఏంటంటే కాంగ్రెస్,టిడిపిలో ఎవరికి ఓటేసినా టిఆర్ఎస్ లో చేరతారని, అదే బిజెపికి ఓటేస్తే టిఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా మారతామని చెప్తున్నాడాయన. అసలు అభ్యర్ధులే లేని పార్టీ బిజెపికి ఆకర్ష్ బెడద లేదు కానీ నిజంగా అధికారపదవులపై ఆశలేని వారెవరున్నారో మరి మొత్తానికి ఈ రకంగానైనా టిడిపి భస్మాసురహస్తం నుంచి బైటపడేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్నది వాస్తవం.
In both telugu states relation between TDP and BJP is going to damage. And both party leaders are talking like that.