వర్మ పైత్యం

10 Feb 2016

                     తెలుగుసినిమా రంగంలో వర్మది ఓ ట్రెండ్, ఓ స్కూల్ ఇది కాదనలేం. కానీ అదంతా గతం, ఇప్పుడు పెతి ఓడూ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. ఐనా వర్మ సినిమాలు ఆడకపోయినా ఆయనకో వర్గం ఫ్యాన్స్ గా నే ఉన్నారు. కానీ ఇప్పుడు వర్మ నా చివరి సినిమా వంగవీటి అంటూ ఓ ఆడియో పెట్టేశాడు. అది ఇలా సాగుతుంది చూడండి. ఈ ఆడియో  వింటే ఏదో సినిమా ప్రోమోలా ఉంది. కానీ చివరి సినిమా ప్రకటన లా లేదంటున్నారు. మీరూ వినండి "నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా నేను నిజంగా పుట్టి పెరిగింది మాత్రం విజయవాడలో ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్‌లో తీయబోతున్న “వంగవీటికి” పగకి, ఆవేశానికి ఉన్న తేడానే ప్రధానమైంది.
                                పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్, శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ, ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు. రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు. ఫ్యాక్షనిజంకి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము, ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు, బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను. అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. "వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది. "శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం “వంగవీటి”తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి” కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు, చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే “వంగవీటి” చిత్రం. కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటివిజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని “వంగవీటి” నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా“వంగవీటి” యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది. వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు వంగవీటి రాధా,  వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకూమారి, దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మనాభం, నందమూరి తారక రామారావు, రామ్ గోపాల్ వర్మ."
Ramgopal is always talk of the industry. With movies and with twits. Today he gave an interview about his retirement in Tollywood. Vangaveeti is the last movie in Tollywood. He started his carrier with Siva movie.