నే వస్తున్నా

22 Feb 2016                    డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ బెజవాడకి వెళ్తున్నాట్ట. ఈ విషయం ఏదో గొప్ప విషయంలా ట్వీట్ చేశాడు. లాస్ట్ సినిమా వంగవీటి అంటూ హడావుడి చేసిన వర్మ, దానికోసం కథారచనలో అవసరమైన అంశాల పరిశోధన కోసం  అక్కడికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ అంతకుముందు చెప్పిన దాని ప్రకారం రంగా గురించి, రాధా గురించి నాకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నాడు వర్మ. అప్పటికి వంగవీటి రాధారంగా ఓ బచ్చా అని తీసిపారేశేలా మాట్లాడిన వర్మ ఇప్పుడు మళ్లీ కొత్తగా పరిశోధించడానికి ఏం మిగిలి ఉందని. అప్పటితరంలో వాళ్లు ఎవరు ఏ కొత్త సత్యాలు చెప్తారని రాగోవ విజయవాడకు  వెళ్తున్నాడని గుసగుసలు విన్పిస్తున్నాయ్.

                వర్మ ఈ సినిమా టీజర్ సందర్భంగా చేసిన హడావుడి మన సైట్లో ఇంతకుముందు చూసే ఉంటారు. బీభత్సమైన మాడ్యులేషన్ తో తన సినిమా గురించి చెప్తూ, ఇదే నా చివరి తెలుగు సినిమా అంటూ అనౌన్స్ చేసిన వర్మ ఆ తర్వాత వంగవీటి గురించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, లైమ్ లైట్ లో ఉండేట్లుగా జాగ్రత్త పడుతున్నాడు.. అందులో భాగంగానే ఇప్పుడీ బెజవాడ యాత్రనే వాళ్లూ ఉన్నారు. విజయవాడలో తాను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలతోనే గాయం అనే సినిమాను తీసిన వర్మ, తర్వాత బెజవాడ పేరుతో ఓ సూపర్ ఫ్లాప్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు కూడా.
Sensational director Ramgopal Varma annouced his last movie Vangaveeti. Today he twitted in i am coming to Vijayawada to prepare story.