రాజమౌళిని అరెస్ట్ చేస్తారా..?

4 Feb 2016


               బాహుబలి రెండో భాగం తీస్తున్న రాజమౌళి అండ్ కో కు చెక్ పడుతున్నట్లుంది. కేరళ అడవుల్లో ఓ షెడ్యూల్ చేసుకొచ్చిన ఆ టీమ్ పై త్రిసూరు యానిమల్ టాస్క్ ఫోర్స్ కేసు పెట్టడానికి సిధ్దమైంది. కేంద్ర వన్యప్రాణుల చట్టం ప్రకారం ఏ జంతువును షూటింగ్ కోసం వాడుకోవాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలి. ఐతే అలాంటిందేం చేయకుండానే రాజమౌళి, చిత్రనిర్మాతలు ఓ ఏనుగుతో తమ షూటింగ్ జరిపారని వారి వాదన. ఐతే సినిమా యూనిట్ మాత్రం కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడినట్లు చెబుతున్నారని. కానీ, షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం అనే వ్యక్తి  ఆరోపిస్తున్నాడు. 

         బాహుబలి సినిమా నిర్మాత, దర్శకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని ప్రధాని కార్యాలయాన్ని ఆయన చెప్తున్నాడు. ఐతే ఆయన చెప్తున్నట్లు ఏ జంతువు లేకుండా సినిమాలు తీయడం గ్రాఫిక్స్ లో సాధ్యపడుతుంది కానీ, నిజంగా కుదరదు. ఇది ఓరకంగా సృజనాత్మకతను అడ్డుకోవడమే. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే గత సినిమాల్లో  అడవిరాముడు, అడవి రాజా, అడవిసింహాలు నిర్మాతలు, దర్శకులు కూడా ఇప్పుడు ఊచలు లెక్కపెట్టుకోవాలేమో ఏదైనా ఇది కొంచెం అతిగానే ఉందేమో.
Ramouli is now busy in Bahubali Part-2 shooting. Now this shooting is doing in Kerala, in Kerala forest they used elephant. Kerala task force is claimed a case on Bahubali, they used elephant with out permission.