బొడ్డుపై పూలూ పళ్ల ట్రైనింగ్

27 Feb 2016                     డైరక్టర్ రాఘవేంద్రరావ్ సినిమాలకు దాదాపు బై చెప్పినట్లే, అందుకే సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో తన సినిమాలు, వాటి వెనుక కథ అంటూ అంతా ఎన్టీఆర్ భజన తోనే సరిపుచ్చాడు. ఇప్పుడు కే ఆర్ ఆర్ ట్రైనింగ్ అంటూ ఓ ఫిల్మ్ డైరక్షన్ కోర్సు పెడుతున్నాడట. ఐతే ఇదంతా యూట్యూబ్ ఛానల్లో, ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ పెట్టారు. ఐతే అప్పట్లో రాజమౌళి చెప్పినట్లుగా సౌందర్యలహరి ప్రోగ్రామ్ నే ఓ ఎపిసోడ్ లా చేసి ట్రైనింగ్ కి ఇచ్చేబదులు కొత్తగా మళ్లీ ఎఁదుకు ట్రైనింగ్ వీడియోలంటున్నారు. ఎఁదుకంటే ఎంత చెప్పుకున్నా రాఘవేంద్రరావ్ స్టైల్ అంటే గుర్తొచ్చేది పూలూ, పళ్లూ, పూలపళ్లలాంటీ హీరోయిన్లు అందుకే ఎవరైనా అవి ఎలా చూపాలో నేర్చుకుంటామంటున్నారు కానీ. సీన్లు వాటి వెనుక కథ గురించి పెద్దగా అడగడం లేదు. ఇది రాఘవేంద్రరావ్ గొప్పతనం  తక్కువ చేసి చెప్పడం కాదు. ఎందుకంటే ఆయనలో ఎంత గొప్పతనం లేకపోతే 100సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకుంటాడు. కానీ ఇప్పటి తరానికి ఆయన డైరక్షన్ పాఠాలు ఏ మాత్రం నచ్చుతాయనేదే సందేహం.
Tollywood director Raghavendra Rao is not doing films now. Almost he leaved movies. But he started RR Training center in Facebook, and Youtube for direction classes.