జోగి జోగి రాసుకుంటే..?

4 Feb 2016


         బూడిదే రాలుతుంది.. ఇప్పుడదే పని నందమూరి కళ్యాణరామ్, పూరీ జగన్నాధ్ చేయబోతున్నారట. తెలుగు స్క్రీన్ పై బూతులను బూతు టైటిళ్లను యధేచ్ఛగా వాడేసుకోవడంలో సిధ్దహస్తుడు పూరీ జగన్నాధ్. లోఫర్, పోకిరి, దేశముదురు వంటి సినిమాల్లో ఇష్టంవచ్చినట్లు చీప్ లాంగ్వేజ్ వాడేసిన పూరీకి పోకిరి తర్వాత సరైన హిట్ పడ్లేదు. టెంపర్ సినిమా హిట్టైందంటారు, అంతలోనే ఫ్లాపనీ అంటారు. మొత్తానికి హిట్టని గట్టిగా ఎవరూ రీసౌండ్ వచ్చేలా చెప్పలేరు. 
             తమ్ముడు జూనియర్ తో తెగ పూసేసుకుంటూ తిరిగేస్తున్న కళ్యాణరామ్ ఇప్పుడు ఈ పూరీతోనే ఓ సినిమా చేయబోతున్నాట్ట. పోకిరి,దేశముదురు సమయంలోనైతే అసలీ కాంబినేషన్ ఏమాత్రం వర్కౌట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు సీన్ వేరు కాబట్టి పూరీ కావాలంటే తారకరత్నతోనైనా చేయగలడు. విషయానికి వస్తే ఈ సినిమాని కల్యాణ్ రామే నిర్మించబోతున్నాడు. ఇది ఆయన ప్రొడక్షన్ హౌస్ లో ఎనిమిదో సినిమా అట. నిజంగా డబ్బులుండాలే కానీ. ఎవరైనా హీరో కావచ్చు. స్టారూ కావచ్చని కల్యాణరామ్ ప్రూవ్ చేశాడు. అంతకుముందు తరంలో నాగార్జున కూడా రుజువు చేశాడంటారు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ కూడా విక్రమార్కుడిలా చాలా ప్రయత్నాలు చేశాడు కానీ పెద్దగా పట్టుదల లేకపోవడంతో తెరమరుగైపోయాడు. అక్కినేని వారసుల్లో సుమంత్ కూడా ఈ కోవకి చెందినవాడే. కులంబలం, ఆర్ధిక అండదండలు ఉంటే ఎన్నాళ్లైనా ఈ వంశానికి చెందిన హీరోలు వస్తూనే ఉంటారు. జనం చూస్తూనే ఉన్నారని ప్రచారమూ చేయించగలరు కూడా. చూద్దాం ఈ కాంబినేషన్ ఏ మాత్రం వర్కౌట్  అవుతుందో.
Tollywood director Puri Jaganath present has no hits. Recently he faced three flaps. Now he is getting ready to do movie with Kalayan Ram. Lets see will happen.