పూరీ రేంజ్ ఇంతగా పడిపోయిందా

27 Feb 2016                      సినిమాలు వరసగా ఢమాల్మనడంతో దిక్కుతోచని పూరీ జగన్నాధ్ ఇక తన పని అయిపోయిందని తానే భావించాడో, లేక తనకో ఛాన్సిస్తాడని నరేష్ అనుకున్నాడో కానీ అల్లరి నరేష్ పూరీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందట. వెకిలి కామెడీ, చిందరవందర డైలాగులు ఎగిరెగిరి గంతులు ఇదీ నరేష్ స్టైల్ రఫ్ క్యారెక్టరైజేషన్ ఘాటు షార్టు పదాల పంచ్ డైలాగులు ఇదీ పూరి హీరో. ఈ రెండింటికీ జత కలుస్తుందా ఇదే మిలియన్ డాలర్ల క్వశ్చెన్

ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు అల్లరి నరేష్, పూరీ పరిస్థితీ డిటో పెద్ద హీరోలతో ప్రాజెక్టులైతే ఉన్నాయ్. కానీ అవెప్పుడు వస్తాయో, హిట్టవుతాయో లేదో తెలీదు. అల్లరి నరేష్ సిచ్యుయేషన్ మరీ ఘోరం, సినిమా రిలీజవడం ఆలస్యం వెంటనే డబ్బాలు వెనక్కి వచ్చేస్తున్నాయ్. 

                 మరోవైపు పూరీ ప్రస్తుత స్థితి ఒకప్పుటి ఇవివి స్థితిని గుర్తుకు తెస్తోంది. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు తీసిన ఇవివి సత్యనారాయణ తర్వాత అన్ని సినిమాలు ఫ్లాపవడంతో శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు ఇక ఆ తర్వాత శ్రీహరితో కూడా సినిమాలు తీసే స్థాయికి పడిపోయాడు. కథాబలం కాకరకాయి అంటూ కబుర్లు చెప్పొచ్చు కానీ. నిజంగా ఆ సీన్ లేకే అలాంటి సినిమాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లరి నరేష్ తో పూరీ జగన్నాద్ సినిమా అంటూ తీస్తే ఆ సిచ్యుయేషన్ లో తీయాల్సిందే కానీ నిజంగా కథ డిమాండ్ చేసైతే కాదు.
Tollywood popular director Puri Jaganath has no movies now. He has a projects with big heroes, but he dont know when will it starts. So now he is doing movie with Allari Naresh.