బాహుబలి నెక్స్ట్ అదేనా

25 Feb 2016                  బాహుబలి సినిమా తర్వాత బాహుబలి టూ వస్తుంది. ఇక ఆ తర్వాత పెళ్లి అనుకుంటున్నారంతా. ఐతే ప్రభాస్ మాత్రం ఆ ఆలోచనకి స్వస్తి చెప్పాడేమో అనుకోవాలి మరి, ఎందుకంటే ఇప్పుడు మరో చారిత్రక సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రుద్రమదేవికి అనుష్కని రికమెండ్ చేసిన ప్రభాస్, ఇప్పుడు గుణశేఖర్ తర్వాతి సినిమా ప్రతాపరుద్రుడులో తానే నటించబోతున్నట్లు టాక్ విన్పిస్తోంది. ఐతే రుద్రమదేవి ప్రమోషన్స్ లో ఈ సినిమాకు ఓ ప్రతాపరుద్రుడు దొరికాడు, అతని కుమారుడు కూడా రుద్రమదేవి లో ఉంటాడు, అంటూ హడావుడి చేసాడు గుణశేఖర్. అది విని జూనియర్ ఎన్టీఆరో, మహేష్ బాబో, లేక అల్లుఅర్జునో అయి ఉంటాడనుకున్నారంతా. మరి ఇప్పుడు లేటెస్ట్ టాక్ చూస్తే ఆ కాంబినేషన్లకు తెరపడిందనుకోవాల్సిందే.


                అసలు ప్రతాపరుద్రుడనే సినిమా కౌముదీ పిక్చర్స్ పతాకంపై చనిపోయిన ఎంఎస్ రెడ్డి తీద్దామనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అందులో నటిస్తారని పేపర్ యాడ్స్ కూడా వచ్చాయ్. ఇన్నాళ్లకు అదే టైటిల్ తో మరో సినిమా వస్తుందంటే విశేషమే. రుద్రమదేవిలాంటి భారీ బడ్జెట్  సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే. బాహుబలితో రేంజ్ పెంచుకున్న ప్రభాస్ లాంటి హీరోలు తప్పనిసరని ఇప్పటికి గుణశేఖర్ గుర్తించాడట. అందుకే అతనితో చర్చలు జరిపేందుకు సిధ్దమయ్యాడంటారు. ఐతే 
బాహుబలి 2 తో  బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పట్లో ఖాళీ అవడు, ఆ తర్వాత మిర్చి నిర్మాతలతో సుజిత్ డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుందంటారు. మరి ఈ రెండు సినిమాల తర్వాత కానీ, ప్రతాపరుద్రుడు తెరకెక్కదనుకోవాలి. అప్పుడైనా ప్రభాస్ పెళ్లి, మిగతా వ్యవహారాలు లేకపోతేనే అందుకే ఆ తర్వాత ఉంటే ఒకటి ప్రతాపరుద్రుడు ఉ్ంటుంది లేదంటే  బాహుబలి పెళ్లి వార్తలు వినొచ్చు.
After Bahuballi hit Prabash is now doing Bahubali-2 movie and he told after that movie he will marry. But after Bahubali-2 movie he is doing a movie in Guna Shekar direction.