ఓ తండ్రి తపన

8 Feb 2016


                     కొడుకును హీరోగా నిలబెట్టాలని సాయికుమార్ పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది మరోవైపు జాలేస్తుంది, వారసుల రాజ్యమేలుతున్న ఈ కాలంలో సాయికుమారుడు ఆదికి కూడా బాగా క్రేజ్ రావాలి. కానీ సాయికుమార్ కి ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ లేదు. అటు కన్నడనాట ఏమైనా ఫాలోయింగ్ ఉందేమో కానీ, ఆది మాత్రం తెలుగుకే పరిమితం కావడంతో సినిమాలు ఎన్ని రిలీజవుతున్నా హిట్ మాత్రం తగలడం లేదు. ఈ ఆదివారం ఏ టీవీ చూసినా పాపం తండ్రీ కొడుకులే కన్పించారు. కొడుకును హీరోగా చూడాలనుకుని సాయి తండ్రి పిజె శర్మ అనుకున్నది సాధించారు. అలానే మనవడ్నీ హీరోగా చూశారు, కానీ ఇప్పుడు ఆది సక్సెస్ మాత్రం సాయికుమార్ కు అందని ద్రాకలా ఊరిస్తూ వస్తోంది. ఐతే ఇక్కడో విషయం గమనించాల్సింది సాయికుమార్ ను హీరోగా పెట్టి ఈశ్వర్ అల్లా అని ఓ సినిమా ఆ కుటుంబమే నిర్మించింది అది ఫ్లాప్, అలానే ఇప్పుడు సాయి కూడా తనయుడ్ని ప్రమోట్ చేయడంలో తానూ నిర్మాతగా మారాడు. ఇన్నాళ్లూ దాచుకున్న డబ్బును ఇలా చేయడంలో రిస్క్  ఉంటుంది. ఏం సంపాదించినా సంతానం కోసమే అనుకుంటే ఏ బాధా ఉండదు. కానీ చివరికి సంపాదించిందంతా పోగొట్టుకుంటేనే చాలా  బాధగా అన్పిస్తుంది. ఈ రెండింటి మధ్యా తేడాను సాయికుమార్ ఫ్యామిలీ గమనించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Hero cum dubbing artiest Saikumar family is doing in movies form last three generations. Present Saikumar son Adhi is doing movie, now he did four to five movies but still now no hit to him.