ఐపోయింది..హోదా కథ ముగిసింది

9 Feb 2016                           ఏపీకి  ప్రత్యేక హోదా ఇక మిథ్యే, జనం దాని ఊసు మర్చిపోయారని కేంద్రమంత్రులు కూడా ధీమాకి వచ్చేసారు. డైరక్ట్ గానే 
ప్యాకేజీ వస్తుందని చెప్పేస్తున్నారు. ఈ నెలలో మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలిసే సుజనా చౌదరి ఉరఫ్ యలమంచిలి సత్యనారాయణ కేంద్రం ఏపికి తొందర్లోనే స్పెషల్ ప్యాకేజీ, జోన్ ను ప్రకటిస్తుందని చెప్పారు ఇవాళ ఢిల్లీలో ఈయనగారి గొంతుతోనే గతంలో బీహార్ ఎన్నికలు ఐపోగానే ప్రత్యేకహోదా ఇస్తుందనే ఆశ ఉందని, నమ్మకం ఉందని తెగ బీరాలు పోయిన సుజనా. ఇప్పుడు స్వరం మార్చి ప్యాకేజీ పాట పాడుతున్నారు. ఐతే అది కూడా ఇంకో మూడు నెలలే ఆ తర్వాత ఇక ఇప్పటికే ఏపీకి చేయాల్సినంత చేశాం, చేయడానికేం లేదు బూడిద తప్ప అది కూడా మోడీ శంఖుస్థాపన సమయంలోనే మట్టి నీళ్లూ తెచ్చాడు కాబట్టి బ్యాలెన్స్ అయిపోయిందనగల సమర్ధులు వీళ్లు. వీళ్లందరికీ ఇంకో పెద్దాయన ఆదర్శం, నేనసలు ఎన్నికైందే కర్నాటక నుంచి ఐనా తెలుగోడ్ని కాబట్టి తెగ నిధుల వరద పారిస్తున్నాం ఏపీకి ఏమనుకున్నారో అని బెదిరించడం వెంకయ్యకు తప్ప ఇంకెవరికి సాధ్యం.

                              ఇవాళ ఢిల్లీలో అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచాలని సుజనా చౌదరి కోరాడట. అసలు అమరావతి ఎక్కడుందో దానికి కనెక్టివిటీ ఎక్కడ్నుంచి వస్తుందో మరి, ఇంతవరకూ సికింద్రాబాద్ నుంచి అమరావతివైపు ఏదైనా ఎక్స్ ప్రెస్ వస్తుందంటే లూప్ లైన్లో పడేసే రాజదాని రైళ్లను అలా ఆపకుండా చేయడమే చేతకాదు కానీ కనెక్టివిటీ పెంచడం కుదురుద్దా. మాటల కోటలకు రేపు ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో ఖచ్చితంగా టిడిపి విజన్ 2039కి అందదు, అది 2019లో రీసౌండ్ వస్తుంటే అప్పుడు అర్ధం అవుతుంది.
AP special status it is the big dream to all AP peoples, But central government is not responding about it till now, and now giving signals to no special status.