కొయ్..కొయ్. కోతలు కోసెయ్

10 Feb 2016


                        నిత్యా మీనన్ అభినయం అందం రెండూ ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో ఒకరు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే పదానికి సరైన డెఫినిషన్ కూడా అంటారు. తన డాషింగ్ నేచర్ వల్లనే తక్కువ సినిమాలకే పరిమితం అవుతుందేమో అని డౌట్ రాకమానదు. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో నిత్య  చెప్పే మాటలు కూడా ఆ విషయాన్నే కన్ఫామ్ చేస్తున్నాయ్ కూడా ఛాన్సుల కోసం ఎవరి దగ్గరకు వెళ్లననని. తానేంటో తెలిసినవాళ్లే తన దగ్గరకు వస్తారంటుంది. అది నిజమే కావచ్చు కానీ టాలెంట్ లేకపోతే అనుకోవచ్చు కానీ ఇబ్బడి ముబ్బడిగా టాలెంటెడ్ పీపుల్ దొరుకుతున్న రీసెంట్  టైమ్స్ లో ఇలా భీష్మించుకుని కూర్చుంటే సిచ్యుయేషన్ ఇలానే ఉఁడటంతో పాటు. బోలెడంత యంగ్ ఏజ్ కాస్తా కరిగిపోతుంది. ఇది నిత్యా మీనన్ కు చెప్పేవాళ్లు లేరు. 

                         బాలీవుడ్ లో ఛాన్సుల సంగతి కూడా చెప్తూ ఓ నమ్మలేని నిజాన్ని చెప్తుంది. ఈ ఫ్యాట్ బ్యూటీకి  ఆఫర్లు చాలానే వచ్చినా, నచ్చక తానే వదిలేసిందట. నిజం చెప్పాలంటే నిత్యా మీనన్ పర్సనాలిటీకి హిందీలో ఛాన్సులు చాలా తక్కువ. ఇప్పటి బాలీవుడ్ ట్రెండ్ చూసినోళ్లు ఎవరైనా ఆ మాట ఈజీగా చెప్పేస్తారు. ప్రీతి జింతా పర్సనాలిటీతో ఉండే నిత్యామీనన్ కు తగ్గ క్యారెక్టర్లంటే ఏ ఆర్ట్ ఫిల్మో, ఆఫ్ బీట్ ఫిల్మో తీస్కోవాలి. కానీ అంత రిస్క్ ఇప్పుడెవరు చేస్తారు. షూటింగ్స్ కి ఒంటరిగానే వెళ్లే నిత్యా మీనన్ ని ఎవరైనా కదిలిస్తే కయ్ మని అరుస్తుందట. పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషనే బెటర్ అని కూడా ఈ మధ్య సెలవిచ్చిన నిత్యా మీనన్, తను చేసే క్యారెక్టర్ కీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా తేడా అని మాత్రం చెప్పొచ్చు.
Kollywood heroin Nitya Menon, she is called as beauty with brains. She told about her offers in movies and Bollywood. She refused her offers in Bollywood also.