నయనతార ఓ సీక్రెట్ ఏజెంటా..?

4 Feb 2016


                  పురాణపాత్రలు, యూత్ క్యారెక్టర్, హోమ్లీ వైఫ్, లవర్ ఇలా ఎన్ని క్యారెక్టర్లు చేసినా నయనతార దాహం తీరుతున్నట్లు లేదు. ఏ క్యారెక్టర్ చేసినా తన అందం అభినయంతో అదరగొడుతున్న నైన్. ఇప్పుడు సీక్రెట్ ఏజెంట్ గా కన్పించబోతోందట. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్నా మిసమిసలాడే అందాలతో అలరించే నయనతార యాక్షన్ సీన్స్ మాత్రం తక్కువే చేసింది. బిల్లా మూవీలో ఫైట్స్ చేసిన నైన్ నానుమ్ రౌడీదాన్ లో రఫ్ క్యారెక్టర్ తో యూత్ మనసు కొల్లగొట్టేసింది.

                 ఇపుడు చియాన్ విక్రమ్ సరసన ఇరుమగన్ లో సీక్రెంట్ ఏజెంట్ గా కన్పించబోతోందిట. ఆనంద్ శంకర్ అనే డైరక్టర్ తీస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా బరువు అందాల నిత్యామీనన్ నటిస్తోంది. మలేషియాలో బీచ్ ఒడ్డున నైన్ యాక్షన్ సీన్స్ చేసిందట. ఈ మూవీ వచ్చే సమ్మర్ కి కానీ ఆగస్ట్ కానీ విడుదల కాబోతుందిట.
Nayanathara is care of address for experimental roles. She did traditional, hot, lover girl characters. Now she is going to do as a secret agent role in latest movie.