ట్విట్టర్ తో సాయం

5 Feb 2016


         ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ను, ఫేస్ బుక్ ను వాడినట్లు ఎవరూ వాడరంటారు. తన పథకాలను, వ్యూహాలను జనం దగ్గరకు చేర్చడంలో ఆయన సోషల్ నెట్ వర్క్ నే నమ్ముకుంటాడు. ఐతే ఆయన మంత్రివర్గ సహచరులు తమ ప్రచారానికి కాకుండా జనం ప్రాణాలను ఇబ్బందులను కాపాడటానికి కూడా సోషల్ నెట్ వర్క్ సైట్లను వాడుతూ భేష్ అన్పించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా సుష్మాస్వరాజ్ తనకి ట్వీట్ చేసిన ఓ ఎన్నారై లేడీని కాపాడిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. 

               జర్మనీ దేశంలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఓ ప్రవాసభారతీయురాలైన గుర్ ప్రీత్ తాను ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేసింది. వెంటనే సుష్మ స్పందించడంతో, జర్మనీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఆమెను ఫ్యామిలీతో సహా సురక్షితంగా ఎంబసీకి తీసుకొచ్చారు. మీరీ వార్త చదివేనాటికి ఇండియాకు కూడా తీసుకొస్తారు.
Narendra Modi using twitter and Facebook to reach his schemes to people. Now his cabinet also using these. Recently Sushma Swaraj a saved a NRI who was rescued in Jarmani.