ఎవరి భవిష్యత్ పై బెంగ

2 Feb 2016


               నారా లోకేశ్ మరోసారి ట్వీట్ చేశాడు. ట్విట్టర్ బాబుపై ఇప్పటికే బోలెడన్ని కామెంట్లు ఉన్నాయ్. జిహెచ్ ఎంసీ ఎన్నికల పుణ్యమాని సిటీలో నలభై రోడ్ షోలు చేసిన లోకేశ్ గొంతు బొంగురుపోయి రెస్ట్ తీసుకుంటున్నాడేమో. ట్విట్టర్లో ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయిుందంటూ ఆందోళన వ్యక్తం చేశాట్ట. ఓటు హక్కు వినియోగించుకోవాలని, హైదరాబాద్ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉందంటూ ట్వీటాడు. ఐతే ఇదే కామెడీ క్రియేట్ చేస్తోంది. లోకేశ్ భవిష్యత్ సిటీ ఓటర్ చేతిలో ఉందా, లేక టిడిపి భవిష్యత్తా అని సెటైర్లు మొదలయ్యాయ్.
               ఎందుకంటే టిడిపికి ఓ పెద్ద ఆశాకిరణంలా స్టార్ క్యాంపైనర్ గా బిల్డప్పులు ఇచ్చిన రేవంత్, లోకేశ్ లు ఈ ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారని బోలెడన్ని ఆరోపణలు. ఇప్పుడు సిటీలో పోలింగ్ కూడా గతంలానే ఉఁడటంతో టిడిపికి టెన్షన్ మొదలైందిట. ఇంత ఖర్చు పెట్టి టిక్కెట్లు తెచ్చుకుంటే, ఓడిపోయినోళ్లు తమపై అటాక్ చేయకుండా ఉఁడటానికే ఈ ట్వీట్లు పనికి వస్తాయ్ కానీ. ఎవరూ ఓటమి బాధ్యత తీసుకోరని గుసగుసలు విన్పిస్తున్నాయ్. ఇప్పటికే టిడిపి-బిజెపి కూటమికి 33సీట్లకు మించి రావని, ఓ ప్రవేట్ ఛానల్ సర్వే ప్రకటించింది. కనీసం ఆ వార్డులు కూడా గెలుచుకోకపోతే. ఇక లోకేశ్ కెరీర్ పై మాయని మచ్చ పడటం ఖాయం. పార్టీ అధ్యక్షుడి కొడుకుగా ఆయనకు పార్టీలో ఎదురుండదు కానీ నైతిక స్థైర్యం దెబ్బతినడం ఖాయం. అందుకే ఇప్పుడు లోకేశ్ ట్విట్టర్లో ఆందోళన పడుతున్నాడంటున్నారు.
Today GHMC elections polling was completed. In this election Nara Lokesh took main part in campaign. Today he twit about GHMC election poling percentage.