నారా రోహిత్..మరో తారకరత్న

27 Feb 2016                          ఇండస్ట్రీకి రావడమే 9సినిమాలతో వస్తున్నాడంటూ తెగ హడావుడి చేసారు తారకరత్న తెరంగ్రేటం చేసినప్పుడు. సన్నగా ఊచలా  ఉన్న తారకరత్నని చూసినప్పుడే కనీసం అందులో నాలుగు రిలీజైనా చాలనుకున్నారు. అందుకు తగ్గట్లే మనోడి సినిమాలు రెండు మూడు కంటే విడుదల కాలేదు, థియేటర్లో పడటం ఆలస్యం వెంటనే డబ్బాలు వెనక్కి వచ్చేవి, డిస్ట్రిబ్యూటర్ల పాలిట కాలయముడిలా తారకరత్నని అనుకునేవాళ్లు. సొంత డబ్బులు పెట్టడం తప్ప బైటివారెవరూ అతనితో సినిమాలు తీసే సాహసం చేయలేదు. ఇప్పుడు రీసెంట్ గా నారా రోహిత్ పరిస్థితీ అంతే ఇది వారి అభిమానులకు వర్గానికి నచ్చకపోవచ్చు కానీ నిజం మాత్రం అదే. సినిమాల కథలు, వాటిలోని నవ్యత అతగాడి నటన గురించి మాట్లాడటం లేదు. 

                          అవి ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నా కూడా నిర్మాతకు పైసా లాభం లేనప్పుడు తొక్క నారా రోహిత్ ఐతే ఏంటి, సంపూర్ణేష్ బాబు ఐతే ఏంటి. ఈ మధ్య కాలంలో నారా రోహిత్ పది సినిమాలు లైన్లో పెట్టాడని విన్పిస్తోంది. నిజంగా అంత సీన్ ఉందా అనకతప్పదు. వాటిల్లో కనీసం నాలుగు ఈ ఏడాది విడుదలైతే అతని సినిమా కెరీర్ సార్దకమైనట్లే. అందుకే నారా రోహిత్ మరో తారకరత్న అనే కాప్షన్ పెట్టాల్సి వచ్చింది. పైగా ఇప్పుడు వస్తుందని చెప్తున్న తుంటరి సినిమాలో విలన్ కూడా తారకరత్నే అట. ఇంకేం అదేదో సామెత చెప్పినట్లు బూడిదా రాలుతుందో, కలెక్షన్లో రాలతాయో చూడాలి.
Nara Rohit film carrier going very slowly. He did nearly ten movies but only 2 or 3 movies were got hit. Now stated ten movies, lets see how many movies will release.