కామన్ సెన్స్ లేకపోతే..

25 Feb 2016                     పొలిటీషియన్ కి కావాల్సిన లక్షణాల్లో ముందు ఉండేది కామన్ సెన్స్ అంటారు. ఒక్క పొలిటీషియన్ కే కాదు, ఏ మనిషికైనా కనీసజ్ఞానం లేకుండా వ్యవహరిస్తే అభాసు పాలు కాకతప్పదు. గతంలో కులపిచ్చి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం ఉన్నపార్టీ ఏదైనా ఉందంటే అది టిడిపి తప్ప మరోటి కాదు అని నారా లోకేష్ అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మా మాటలు నమ్మకపోతే యూట్యూబ్ లో వెతికితే మీకే తెలుస్తుంది. ఇప్పుడలానే మరోసారి నోరు జారాడు చినబాబు. కడప జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించే పనిలో పడ్డ లోకేష్, తన పనేదో తాను చూసుకోకుండా జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎందుకు కృషి చేయలేదని దివంగత సిఎం వైఎస్ పై ఆరోపణలు చేసారు. చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే, ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు  కానీ, అక్కడ స్థానికులు ఎందుకు ఊరుకుంటారు. వెంటనే బ్రహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు ప్లానేసిందే వైఎస్సంటూ నినాదాలు చేశారు. దీంతో మన మొద్దబ్బాయ్ కవర్ చేసుకోలేక నానాతిప్పలూ పడ్డాడు. 

                       అలానే ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే తమ అభిమతమని డైరక్ట్ గా చెప్పేశాడు. ఇది కూడా కేడర్ లో చిరాకు పుట్టించింది, ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకోవాల్సిందేనంటూ డైరక్ట్ గా చెప్తున్న లోకేష్. తిరుపతి కార్యకర్తల శిక్షణలో అదే అంశం చెప్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినట్లుందని కొంతమంది గుసగుసలకు పోయారు. హెరిటేజ్ అవినీతిని నిరూపించాలని సవాల్ విసరడం కూడా లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమంటారు. స్టాక్ మార్కెట్ లో లిస్టైన ఈ కంపెనీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతుంటుందని, ఆ సంస్థ ఉద్యోగులే కోస్తా జిల్లాల స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో చెప్తుంటారు. కావాలంటే ఓ యాబై షేర్లు కొంటే చాలు, ఆ మతలబేంటో తెలుస్తుందని చెప్పడం కూడా గమనార్హం. మార్కెట్లో 400 రూపాయలకు దొరికే నెయ్యి పాకెట్ ను ఆరొందలకు అమ్మడం అవినీతి కాదా, బయట పదిరూపాయలకు అమ్మే ఆపిల్ పండును యాభై రూపాయలకు అమ్మడం నీతిమంతులు చేసే పనేనా సూపర్ మార్కెట్ బాధితులూ అడుగుతున్నారు జవాబిస్తావా చినబాబూ..!
TDP youth leader Nara Lokesh is very busy with attracting YSRCP MLAs. Recently he visted Kuddapa district and commented about YS Rajashekar Reddy, for that people gave counter to him.