ట్విట్టర్ పిట్ట జోక్

10 Feb 2016              అసలే ఓటమి మిగిల్చిన విషాదంతో ఎలా తలెత్తుకోవాలో తెలీక సగటు టిడిపి కార్యకర్త బాధపడుతుంటే పుండుపై కారం చల్లినట్లు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి జంపవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ట్విట్టర్ పిట్ట చేస్తున్న కామెంట్లు తెలుగుదేశం నేతలకు జుట్టు  పీక్కునేలా చేస్తున్నాయ్. ఆయనేదో టిడిపిలో భరోసా నింపడం మాట ఏమోకానీ, ఇంకాస్త చిక్కుల్లో పడేస్తున్నాయ్. ఇంతకీ లోకేష్ ఏమంటాడంటే టిడిపికి సిటీ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయట. పోలింగ్ పర్సంటేజ్ తక్కువైనా కూడా టిడిపికి ఏడున్నరలక్షల ఓట్లు ఎక్కువని చెప్తున్నాడాయన.

                 అంటే ఈ మాత్రం ఓట్లు వచ్చాయంటే గొప్పే అనా, లేక అసలు మన సత్తాకిదే ఎక్కువనా ఓడిపోయిన వీళ్లే ఇలా అనుకుంటే ఇక గెలిచిన టీఆర్ఎస్ ఎలా ఫీలవుతుందో అనే ఇష్యూనే పట్టించుకోడా లోకేష్..? ఇదే పని ఏపీలో వైఎస్సార్సీపీ చేస్తే ఎద్దేవా చేసిన టిడిపి నేతలు. ఇప్పుడు చినబాబు కామెంట్లను ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి. పైగా టిఆర్ఎస్ హామీల విలువ 40వేల కోట్లంటూ లెక్కలేసిన చినబాబు గారు. ఏపీలో హామీల సంగతి మాత్రం అడగొద్దంటారా, టిడిపి టెస్ట్ మ్యాచ్ ఆడుతుందని టీ ట్వంటీలో ఓడిపోతే పెద్ద విషయమేం కాదన్నాడు లోకేష్ కిందపడ్డా పై చేయంటే ఇదే.
All TDP leaders are in sad GHMC elections results, and some of the leaders are jumping to TRS. Today Nara Lokesh joked about GHMC results, we got more votes when compared with last elections.