లోకేష్ ది ఐరన్ టంగా..?

25 Feb 2016                  లోకేష్ బాబు మరో సవాల్ విసురుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎన్నిసవాళ్లు విసిరాడో ఎన్నిసార్లు తొడగొట్టాడో అందరికీ గుర్తుంది. చివరికి సింగిల్ హీరోని గెలిపించుకుని తామే సిటీ ఎలక్షన్స్ లో నంబర్ వన్ గా నిలిచిందీ అందరికీ తెలుసు అలాంటి లోకేష్ ఏపీ ప్రతిపక్షనేత  జగన్ కు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే ఒక్క రోజులో టిడిపి ప్రభుత్వాన్ని జగన్ పడగొట్టాలట. ఇప్పటికే జగన్ తనకు ప్రభుత్వాన్ని పడగొట్టే బలం లేదు, ఆ బలం వచ్చిన గంటలోనే పడగొడతా అని చెప్పారు. అది కూడా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకే సమాధానంగా చెప్పాను తప్ప అంతా రెడీగా ఉందని చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు.

                    వైసీపీ ఎమ్మెల్యేలు కర్నూలు నుంచి టిడిపిలోకి వెళ్తారట కదా అని అడిగితే మాకూ టచ్ లో ఉన్నారనే జగన్ అన్నది. దాన్ని పట్టుకుని ఎప్పుడు సర్కారును పడేస్తారంటే. ఆ 21మంది పేర్లు తెలిసిన వెంటనే ఒక్క గంటలో అని చెప్పడం అందరూ గమనించే ఉంటారు. ఆ సమాధానంలోనే కామికల్ గా జగన్ అలా అన్నాడు కానీ, నిజంగా బలం ఉందని కాదనేది అర్థమవుతోంది. అది పట్టుకుని దమ్ముంటే ఓ రోజులో పడేయ్ అంతకుమించి పడేస్తే లెక్కకాదు అని చిన్న పిల్లాడిలా మాట్లాడటం లోకేష్ కే చెల్లుతుంది. ఇలా సవాళ్లు విసిరే గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేయకుండా తప్పించుకున్న రేవంత్, ఎర్రబెల్లిల సంగతి ఏమైందో తెలుసు. ఇప్పుడు లోకేష్ ఇంత గాంబీర్యమైన ఛాలెంజ్ లు విసరడం ఏదోక రోజు వికటించకతప్పదని కేడర్  ఆందోళన పడుతోంది, ఎందుకంటే మనోడిది ఐరన్ టంగ్ అని టాక్.
TDP youth leader Nara Lokesh toung is iron toung, this words are told by some TDP leaders. In GHMC elections he gave open challenge, they got only one seat. Now he gave challange to Jagan about TDP government.