ముచ్చటగా మూడు రోజులు

8 Feb 2016


                 కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష ముగిసింది. కాపులను  బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్తూ ఆయన సోమవారం నిమ్మరసంతో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కాపు కమిషన్ కు 500కోట్లు, ఏటా వేయికోట్ల నిధులు కేటాయిస్తామన్నారని ముద్రగడ చెప్పారు.  దీంతో ఒక్కసారిగా లేచిన తాటాకుమంటలా ఈ కాపుల రిజర్వేషన్ అంశం చల్లారినట్లైంది. ఐతే  ప్రశ్నలు మాత్రం అలానే మిగిలిపోయాయ్ ఎందుకంటే చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడం లేదని చెప్పలేదు. రెండు ఎకరాలు, రెండు లక్షలకోట్ల సంపాదనపై ఎద్దేవా చేసిన ముద్రగడ హఠాత్తుగా  ఎందుకు వెనక్కి తగ్గిందీ తెలియడం లేదు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ ఏ అంశాలు ముద్రగడను దీక్ష విరమించేలా చేశాయో. 

                అలానే ఇంకో వారం రోజులు రగులుతుందనుకున్న బిల్డప్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ నేతలనూ ముద్రగడను కలవనీయలేదు. సడన్ గా ఎలా విరమింపజేయడంలో సక్సెస్ అయిందీ తెలియరాలేదు. ఏదైతేనేం ఇప్పుడిలా ఇప్పటికింతే అన్నట్లుగా కాపుల రిజర్వేషన్ అంశం చల్లారినట్లే. తిరిగి మళ్లీ ఎప్పుడో జీవం పోసుకుంటుంది. అప్పుడు సిచ్యుయేషన్ ఎవరి చేతిలో ఉంటుందో మరి.
TDP leader is doing fasting for Kapu reservations from last three days. Today AP government sent three ministers team to talk with him. So he reigned his fasting.